విజయ్ తన తల్లిదండ్రుల వేధింపుల వల్లే చనిపోయాడు: వనితారెడ్డి

విజయ్ తన తల్లిదండ్రుల వేధింపుల వల్లే చనిపోయాడు: వనితారెడ్డి
x
Highlights

కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కమెడియన్‌ విజయ్‌సాయి భార్య వనితారెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సరెండర్ కావాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులతో...

కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కమెడియన్‌ విజయ్‌సాయి భార్య వనితారెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సరెండర్ కావాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులతో ఆమె లాయర్‌తో వచ్చి లొంగిపోయారు. విజయ్ సెల్ఫీ వీడియోలో చేసిన ఆరోపణలపై పోలీసులు వనితారెడ్డిని విచారిస్తున్నారు.

తన కూతురు భవిష్యత్ కోసమే ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్నానని చెప్తోంది వనితారెడ్డి. తానెక్కడికీ పారిపోలేదని తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని నిరూపించడానికే ఇన్నాళ్లూ బయటకు రాలేదని తెలిపింది. సాక్ష్యాలు సేకరించడానికి ఆలస్యమైందన్నారు. విజయ్‌ను తాను వేధించలేదని సెల్ఫీ వీడియోలో తన పేరు ఎందుకు చెప్పాడో తెలియడం లేదని చెప్తోంది వనితారెడ్డి. తల్లిదండ్రుల వేధింపుల వల్లే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తోంది వనితారెడ్డి. విజయ్‌ ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని మూడేళ్లుగా విజయ్‌కి దూరంగా ఉంటున్నానని తెలిపింది. విజయ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి తాను సేకరించిన ఆధారాలను పోలీసులకు సమర్పిస్తునట్లు చెప్పింది వనితారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories