నాప్రాణం ఉన్నంత వ‌రుకు జ‌గ‌న్ తోనే

నాప్రాణం ఉన్నంత వ‌రుకు జ‌గ‌న్ తోనే
x
Highlights

ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలను కోల్పోయిన వైసీపీ...తాజాగా మ‌రో మాజీ ఎమ్మెల్యేను కూడా కోల్పోనున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి...

ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలను కోల్పోయిన వైసీపీ...తాజాగా మ‌రో మాజీ ఎమ్మెల్యేను కూడా కోల్పోనున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 22నగాని లేక 23వతేదీనగాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. విజయవాడకు చెందిన మరో వైసీపీ నేత పూనూరు గౌతమ్‌రెడ్డితో రాధకు విభేదాలు వచ్చినప్పుడు పార్టీ నుంచి తగిన రీతిలో మద్దతు లభించలేదని, దీంతో మనస్థాపానికి గురైన రాధ వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
అయితే ఈ వార్త‌ల‌పై స్పందించిన వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ `మా నాన్నని చంపిన టీడీపీలోకి నేనెందుకు జాయిన్ అవుతాను? నాకు టీడీపీలో జాయిన్ అవ్వాల్సినంత ఖర్మ పట్టలేదు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. జ‌గ‌న్ తన సోదరుడని స్పష్టం చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని తేల్చిచెప్పారు. 2019లో బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి గెలిచి కృష్ణాజిల్లాలో మిగిలిన సీట్లను సైతం గెలిపించే అందుకు తన సర్వశక్తులు ఒడ్డుతానని వంగవీటి రాధా ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories