ట్రంప్ నిర్ణయాన్ని ఆమోదించని సెనేట్

x
Highlights

అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయ్యింది. ఇలా జరగడం ఈ ఏడాదిలో ఇది మూడవసారి. అమెరికా-మెక్సికో సరిహద్దులో చొరబాట్లను నియంత్రించడానికి రక్షణ గోడ...

అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయ్యింది. ఇలా జరగడం ఈ ఏడాదిలో ఇది మూడవసారి. అమెరికా-మెక్సికో సరిహద్దులో చొరబాట్లను నియంత్రించడానికి రక్షణ గోడ నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరు బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వ స్తంభనకు దారి తీసింది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 12.01 గంటల నుంచి పలు ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలను, పార్కులను మూసివేశారు. అమెరికా ప్రభుత్వానికి మరోసారి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమెరిక-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి 5 బిలియన్ల అమెరికన్‌ డాలర్లను కోరారు. ఇందుకు అమెరికన్ కాంగ్రెస్ నో చెప్పింది. ఈ అంశంపై ట్రంప్ డెమోక్రాట్ల మధ్య రాజీ కుదరలేదు. ట్రంప్ ప్రభుత్వం స్తంభించింది.
ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల విడుదల నిలిచిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు పని చేయలేదు. దాదాపు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఇళ్లకేపరిమితం అయ్యారు. దీంతో అమెరికా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ప్రభుత్వం స్తంభించిన విషయాన్ని అమెరికా అధ్యక్షు ట్రంప్ నిర్ధారించారు. డెమోక్రాట్ల వల్లే ప్రభుత్వం స్తంభింపచేయాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇది తాత్కాలికమేనని ముందడుగు వేస్తామని ట్రంప్ ప్రకటించారు. మరో మూడు రోజుల్లో క్రిస్మస్ ఉన్న సమయంలో ప్రభుత్వం షట్ డౌన్ కావడంతో అమెరికా పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. సమస్య పరిష్కారం కోసం అమెరికా ఫెడరల్‌ వ్యయ బిల్లు విషయంపై శ్వేతసౌధం అధికారులు, రిపబ్లిక్‌, డెమోక్రటిక్‌ పార్టీలకు చెందిన కాంగ్రెస్‌ నేతలతో జరుపుతున్న చర్చలు ఎంతవరకు సఫలమవుతాయో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories