logo
సినిమా

ఇట‌లీలో 'ఉన్న‌ది ఒకటే జింద‌గీ'

ఇట‌లీలో ఉన్న‌ది ఒకటే జింద‌గీ
X
Highlights

'నేను శైల‌జ'వంటి విజ‌యవంత‌మైన చిత్రం త‌రువాత క‌థానాయ‌కుడు రామ్‌, సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్‌,...

'నేను శైల‌జ'వంటి విజ‌యవంత‌మైన చిత్రం త‌రువాత క‌థానాయ‌కుడు రామ్‌, సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం 'ఉన్న‌ది ఒకటే జింద‌గీ'. ఈ చిత్రంలో రాక్ స్టార్‌గా క‌నిపించ‌బోతున్నాడు రామ్‌. ఇందుకోసం గిటార్ పాఠాలు కూడా నేర్చుకున్నాడు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఇట‌లీలోని మిల‌న్‌లో రామ్‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 27న లేదా న‌వంబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. స్ర‌వంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ గ‌త చిత్రం 'హైప‌ర్' ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఈ నేప‌థ్యంలో 'ఉన్న‌ది ఒకటే జింద‌గీ' విజ‌యం రామ్‌కి కీల‌కంగా మారింది.

Next Story