ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం వైసీపీదే : మాజీ ఎంపీ

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం వైసీపీదే : మాజీ ఎంపీ
x
Highlights

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ జోస్యం చెప్పారు. సోమవారం మీడియాతో...

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ జోస్యం చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన అయన ఏపీలో ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, సందేహం లేకుండా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్థుందన్నారు. జగన్ పాదయాత్రలో జనాదరణ బాగా ఉందన్న ఉండవల్లి దీనిని తనకు అనుకూలంగా మర్చుంటాడా లేదా అన్న విషయం ఎన్నికలు జరిగితే తెలుస్తుందన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డబ్బులు ఇవ్వకుండానే సభలకు జనం వస్తున్నారని.. అదే వైసీపీకి అయితే బస్సు ఏర్పాటు చేస్తేనే జనం వస్తారని, టీడీపీకి మాత్రం డబ్బులు ఇస్తేనే వస్తారని అన్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను చూసే కొంతమంది ఓట్లు వేశారని తద్వారా టీడీపీ అధికారం చేపట్టగలిగిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories