స్వైన్‌ప్లూ కలకలం

స్వైన్‌ప్లూ కలకలం
x
Highlights

కృష్ణాజిల్లా కోడూరు మండలం‌ చింతకొల్లలో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టించింది. కోడూరు మండలం చింతకోళ్ల గ్రామానికి చెందిన పేరే నాంచారయ్య(45) 3 రోజుల క్రితం...

కృష్ణాజిల్లా కోడూరు మండలం‌ చింతకొల్లలో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టించింది. కోడూరు మండలం చింతకోళ్ల గ్రామానికి చెందిన పేరే నాంచారయ్య(45) 3 రోజుల క్రితం స్వైన్ ఫ్లూ తో మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన పేరే మరియమ్మ(32) కూడా 5 రోజుల క్రితం అంతుచిక్కని వ్యాధితో మరణించాడు. స్వైన్ ఫ్లూ వైరస్ చింతకోళ్ల గ్రామం అంతటా వ్యాపించిందంటూ పుకార్లుతో చింతకోళ్ల వాసులతో మాట్లాడటం మానేసిన సమీప గ్రామాల ప్రజలు. విద్యార్థులకు అనధికారిక సెలవులు ప్రకటించిన ప్రవేటు పాఠశాలల యాజమాన్యాలు. ఆ గ్రామానికి స్కూల్ బస్సుల నిలిపివేశారు. గ్రామానికి పాలు పోయాడానికి వచ్చేవారు కూడా పాల సరఫరా కూడా నిలిపివేశారు. పక్కనే ఉన్న ఇరాలి గ్రామంలో చింతకోళ్లకు వెళ్లవద్దు అంటూ మైకు ద్వారా ప్రచారం నిర్వహించినట్లు సమాచారం. గ్రామస్తులు ప్రభుత్వాధికారులకు తెలియడంతో వారు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories