Top
logo

రెండేసి ఉద్యోగాలు.. రెండు జీతాలు

రెండేసి ఉద్యోగాలు.. రెండు జీతాలు
X
Highlights

కెరీర్‌ కోసం ఒకటి.. హాబీతో మరోటి వయసు ఉండగానే అదనపు సంపాదన రేపటి కోసం ఇప్పుడు కష్టపడాల్సిందే అన్ని...

  • కెరీర్‌ కోసం ఒకటి.. హాబీతో మరోటి
  • వయసు ఉండగానే అదనపు సంపాదన
  • రేపటి కోసం ఇప్పుడు కష్టపడాల్సిందే
  • అన్ని రంగాల్లో కనిపిస్తున్న ధోరణి
  • ఒక్క జీతం చాలదంటున్న యువత
  • మధ్య వయసు వారిదీ అదే మాట
  • పెరుగుతున్న ఖర్చులు.. చాలని వేతనాలు
  • పెద్ద నగరాల్లో ఉంటేనే అవకాశాలు
  • ప్రతిభ ఉన్నా చిన్న నగరాల్లో కష్టమే
  • ఇంటి నుంచి ఆన్‌లై‌న్‌లోనే సగం పనులు

మేక్‌ ద మోస్ట్‌ ఆఫ్‌ ఇట్‌..! కాస్త ఉత్సాహవంతులైన కుర్రకారును ఎవరిని కదిపినా వచ్చే ముందు మాట ఇది. మనకున్నది ఒకటే జీవితం. ఒక్క ఉద్యోగం కోసం ఎంతోమంది కష్టపడుతున్న కాలంలో రెండు ఉద్యోగాలు ఒకేసారి చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఆనందం కోసం ఒకటి.. ఆత్మ సంతృప్తి కోసం మరొకటంటూ హాబీలనే కెరీర్‌గా మలుచుకుంటున్న వారు కొందరైతే, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ జీవితానికో అర్థాన్ని ఇస్తున్నారు మరికొందరు. భారీ లక్ష్యాలతో వేగంగా డబ్బు సంపాదించడానికి రెండో ఉద్యోగమే శరణ్యమంటూ కష్టమైనా ఇష్టంగా 10 గంటల డ్యూటీ తరువాత మరో నాలుగైదు గంటలు పని చేయడానికి సిద్ధమవుతున్నారు. యజమానుల్లో ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర ఉద్యోగాలు చేసే వారు కొందౖరెతే, తెలిస్తే పోయేదేముంది.. అదోరకం ఉద్యోగం, ఇదో రకం అంటూ సర్దిచెప్పుకుంటున్న వారు మరికొందరు. ఓ అంచనా ప్రకారం హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులలో కనీసం 25-30% మంది డబుల్‌ కెరీర్స్‌లో ఉన్నవారే!

అక్కడ సహజం.. ఇక్కడ నేరం
పాశ్చాత్య దేశాలలో ఒక్కరే రెండు లేదంటే మూడు ఉద్యోగాలు చేయడం మామూలే. దానికి అక్కడి కంపెనీలు కూడా సరేనంటారు. కానీ మనదేశంలో అర¬తే మరో కంపెనీలో ఫుల్‌ టైమ్‌ కాదు కదా పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేయడానికి కూడా అనుమతించవు. అది నైతికంగా తప్పని చెప్పడమే కాదు, కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ అనే వాదననూ తెస్తారు. ఒక కంపెనీకి పనిచేస్తూ, ఆ కంపెనీ దగ్గర జీతం తీసుకుంటున్నప్పుడు ఆ కంపెనీకే అంకితం అయిపోవాలంటారు.

అక్కడి పని అయిపోయాక వేరే పని చేసుకుంటే మీకేంటని అడిగినా సమాధానం ఉండదు. దీనిపై న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ "ఒక సంస్థ వనరులు లేదంటే సమయం వెచ్చించి, మరో సంస్థ కోసం అదే సమయంలో పనిచేయడం, అదీ కంపెనీ సమ్మతి లేకుండా చేయడం నేరం. ఆ ఉద్యోగిౖపె చర్యలు తీసుకునే హక్కు కంపెనీకి ఉంది. ఈ విషయం ఉద్యోగి కంపెనీలో చేరే రోజు చేసుకునే ఎంప్లాయ్‌మెంట్‌ అగ్రిమెంట్‌లో ఉంటుంది. అయితే కొంతమంది ఇతర ఉద్యోగాలు చేస్తున్నారు కదా అని అంటే.. వారు ఇతర ఉద్యోగాలు ఏవైనా చేస్తుండవచ్చు. ఒకే లాంటి సంస్థలలో చేయడం మాత్రం నేరమే అవుతుంది'' అన్నారు.

ఐటీ ఇంజనీర్‌ రామ్‌నాథ్‌ రెడ్డి మాత్రం.. తనకు రోజువారీ ఉద్యోగంలో ఉండే ఒత్తిడిని అధిగమించేందుకు సాయంత్రం పూట పిల్లలకు సంగీతం నేర్పుతానని, అది తనఃకు మానసికంగా చాలా రిలీఫ్‌ ఇస్తుందని అంటున్నారు. దీనివల్ల.. ఒకవేళ ఏ రెసిషన్‌ కారణంగానో ఉద్యోగం పోయినా దీంతో కొన్నాళ్లు మేనేజ్‌ చేయగలనని ధీమా వ్యక్తం చేశారు. రెండు చోట్ల ఉద్యోగాలు చేసినా.. రెండింటికీ పూర్తిస్థాయిలో న్యాయం చేయడం మిల్లీనియల్స్‌లో కనిపిస్తున్న విశిష్ట లక్షణంగా చెబుతున్నారు సైకాలజిస్ట్‌లు.

కంపెనీలకు లాభం.. ఉద్యోగులకూ ప్రయోజనం..
ఇప్పట్లో ఏ ఉద్యోగం మీదా నమ్మకం లేదు. ఐటీ, ఫార్మా, బీపీఓ, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌, బ్యాంకింగ్‌.. ప్రతి రంగంలోనూ ఆందోళన తారస్థాయిలో ఉంది. ఇప్పటికే ఆటోమేషన్‌ వఃల్ల ఐటీ, బ్యాంకింగ్‌లో కాస్ట్‌ కటింగ్‌ విధానాలు జోరుగా అమలవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎంప్లాయీ స్కిల్లింగ్‌ ప్రతి రంగంలోనూ అత్యంత ఆవశ్యకంగా మారింది. ఒకరు ఒకే పనిచేయడం కాకుండా మల్టీ టాస్కర్స్‌గా ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. ఈ మల్టీ టాస్కర్స్‌కు కంపెనీలు బ్రహ్మరథం పడుతుండటంతో అటు కంపెనీల కార్యమూ.. ఇటు ఉద్యోగులకు లాభమూ ఒకేసారి కలుగుతుంది.

ఇదే విషయౖమె ఓ మల్టీమీడియా కంపెనీ ఉద్యోగి ఆదిత్య మాట్లాడుతూ "ఒకే కంపెనీ పెద్ద మొత్తంలో జీతాలు అందించే రోజులు కావివి. నేనే గతంలో గ్రాఫిక్‌ డిౖజెనర్‌గా చేశా. ఆ కంపెనీ ఇక్కడ బిచాణా ఎత్తేయడంతో వేరే కంపెనీకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే ఈ డ్యూయల్‌ జాబ్స్‌ ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఓ సంస్థలో గ్రాఫిక్‌ డిౖజెనర్‌గా చేస్తూనే మరో కంపెనీలో యానిమేటర్‌గా కూడా వర్క్‌ చేస్తున్నా. రెండు చోట్లా పార్ట్‌‌టైమ్‌. రోజుకు 10 గంటలు. నేను కోరుకున్న జీతం వస్తుందిప్పుడు. ఒక్కరే అంత మొత్తం ఇవ్వరు. వాళ్లకు పనవుతుంది. నాకూ పనవుతుంది. ఆల్‌ హ్యాపీస్‌'' అన్నాడు. అయితే ఇతరుల అవకాశాలను కొల్లగొట్టినట్లేగా అన్న మాటలను అంగీకరించడానికి డబుల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌ అసలు అంగీకరించడం లేదు. ప్రతిభ ఉన్నవాడిదే రాజ్యం. మాకు ప్రతిభ ఉంది కాబట్టి అవకాశం వస్తుంది.. ఉపయోగించుకుంటున్నామని చెబుతున్నారు.

రేపటి కోసం ఆరాటం..
ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం చెప్పినంత సులభమేమీ కాదు. ప్రత్యేక షెడ్యూల్స్‌తో పాటుగా వైవిధ్యమైన డెడ్‌లై‌న్స్‌ చేరుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇవన్నీ కూడా ఒత్తిడితో కూడుకున్న అంశాలే. ఈ ఒత్తిడిని తమకు అనుకూలంగా మలుచుకుని ముందుకు వెళ్లినవారే విజయం సాధించగలరు. లేదంటే.. మొదటికే మోసం వచ్చే అవకాశాలున్నాయన్నది సైకాలజిస్ట్‌ల మాట. ఇదే విషయౖమె సైకాలజిస్ట్‌ రమణ మాట్లాడుతూ "ఇప్పుడున్న పరిస్థితిల్లో రెండు ఉద్యోగాలు చేయడం అవసరౖమెంది. దొరికిన ప్రతి అవకాశాన్నీ చేజిక్కుంచుకోవాలన్న ఆతృతలో నేటి తరం నేలవిడిచి సాము చేస్తోంది. సంపాదించాలన్న ఆత్రం వారిని నిలువనీయడం లేదు. భవిష్యత్‌లో సుఖపడవచ్చన్న వారి ఆశ వర్తమానంలో నీరసించిపోయేలా చేస్తుంది. తమపై పెరిగిన భారాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలరు'' అన్నారు. నిజానికి మల్టీటాస్కర్స్‌గా ఉండకపోతే కష్టమేనని మిల్లీనియల్స్‌ భావిస్తున్నారు. ఒకే పని చేయడం బోర్‌. వర్క్‌లో వైవిధ్యం ఉండటంతో పాటుగా ఇన్‌కమ్‌ కూడా బాగుండాలంటే మల్టీ జాబ్స్‌ బెస్ట్‌ అని అంటున్నారు ఓ పేరొందిన ఫార్మా కంపెనీలో ఎక్కౌంటెంట్‌గా చేస్తున్న సౌజన్య. నిజానికి మన వ్యక్తిత్వానికి వైవిధ్యమైన కోణాన్ని ఈ మల్టీ టాస్క్స్‌ అందిస్తాయంటున్న ఆమె అవి తప్పనిసరిగా కెరీర్‌ గ్రోత్‌కు ఉపయోగపడతాయని అనుభవపూర్వకంగా తెలిసిందంటున్నారు.

భవిష్యత్‌ మీద బెంగ..
ఓ మధ్యతరగతి జీవి ఆనందంగా జీవించే రోజులు కావివి. హైదరాబాద్‌లో నెలకు 30 వేలు సంపాదించే వారికి కూడా కష్టంగానే ఉంటోంది. కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇంటి అద్దెలు, నిత్యావసరాలు, పిల్లల ఫీజులు, రవాణా.. ఇలా అన్నీ పెరిగిపోతున్నార¬. మారనిది ఏౖమెనా ఉందంటే.. అది సగటు జీవి జీతమే ! ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని నెట్టుకురావడానికి డబుల్‌ జాబ్స్‌ బెస్టని నగరవాసి డిౖసెడయ్యాడు. ఓ ఫిట్‌నెస్‌ స్టూడియోలో ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలు అందిస్తున్న లాయర్‌ ప్రకాష్‌ ఇదే విషయౖమె మాట్లాడుతూ "నిజానికి నా వృత్తిలో నాకు దొరికే సమయం చాలా తక్కువ. అయినా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఎలా మారారంటే జస్ట్‌ ఫర్‌ ఫన్‌ అని చెప్పక తప్పదు. ఫిట్‌నెస్‌ పట్ల నాకు అమితాసక్తి. దాంతోనే జిమ్‌కు వెళ్లేవాడిని. ఒక రోజు ఇన్‌స్ట్రక్టర్‌ రాకపోవడంతో నేను పక్క న ఉన్నవారికి చెప్పడంలో నా టాలెంట్‌ బయటపడింది. డబ్బు పెద్దగా వచ్చేది ఉండదు కానీ.. రొటీన్‌ వర్క్‌ నుంచి కాస్త బ్రేక్‌. అది చాలా రిలీఫ్‌'' అన్నారు.

ఇలా చేయండి..
ద ఎలిఫెంట్‌ అండ్‌ ఫ్లియా అంటూ ప్రొఫెసర్‌, స్పీకర్‌, రచయిత చార్లెస్‌ హ్యాండీ రాసిన పుస్తకంలో మల్టీపుల్‌ జాబ్స్‌ను పోర్ట్‌ఫోలియో లైఫ్‌గా అభివర్ణించారు. ఆ పుస్తకంలో మల్టిపుల్‌ జాబ్స్‌ వల్ల ప్రయోజనాలు, ఇబ్బందులతోపాటు ఎలా వాటిని మేనేజ్‌ చేయవచ్చో కూడా వివరించారు. రెండో ఉద్యోగం వల్ల ఎదురయ్యే సవాళ్లను ఏ విధంగా అధిగమించవచ్చంటే..

మీరు ఎంచుకునే రెండో ఉద్యోగం తప్పనిసరిగా మీరు అభిమానించేదిగా ఉండాలి. హాబీనే కెరీర్‌గా తీసుకోవడం ఇక్కడ ఉత్తమం

రెండు ఉద్యోగాలకూ తగిన రీతిలో షెడ్యూల్‌ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మరింత ప్రొడక్టివ్‌గా పనిచేయడం సాధ్యమవుతుంది.

ఒక జాబ్‌ నుంచి మరో జాబ్‌కు వెంట వెంటనే మారడం కాస్త కష్టం. నిజానికి థాట్‌ ప్రాసెస్‌లో అంత వీలు పడదు. కాబట్టి మీకున్న సమయంలో కాస్త సమయాన్ని మరో జాబ్‌కు వెళ్లేందుకు అనువుగా మార్చుకునేందుకు కేటాయించాలి.

రెండు ఉద్యోగాలు చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకున్నట్లే. అది రొటీన్‌ అయితే బోర్‌ కొట్టే అవకాశం ఉంది. కనుక మిమ్మల్ని మీరు రీచార్జ్‌ చేసుకోవడానికి, మారుతున్న ధోరణులను పసిగట్టడానికి కాస్త సమయం కేటాయించాలి.

అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు సమయం కేటాయించాలి.

Next Story