చరిత్రకు ఒక్క అడుగు దూరంలో సింధు

చరిత్రకు ఒక్క అడుగు దూరంలో సింధు
x
Highlights

ఆసియా క్రీడల చరిత్రలో పీవీ సింధు రూపంలో తొలిసారి భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌...

ఆసియా క్రీడల చరిత్రలో పీవీ సింధు రూపంలో తొలిసారి భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 21–17, 15–21, 21–10తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)పై గెలిచింది. దీంతో ఫైనల్లో అడుగుపెట్టింది.. తద్వారా పీవీ సింధు ఆసియాడ్‌లో చారిత్రక స్వర్ణానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రవేశించింది. టైటిల్‌ కోసం ఇవాళ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తైజు యింగ్‌ను ఢీకొనేందుకు రెడీ అయింది. ఈ ఆసియా క్రీడల్లో యమగుచిపై సింధుకు ఇది రెండో విజయం. టీమ్‌ చాంపియన్‌షిప్‌లోనూ యమగుచిని చిత్తు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories