సోషల్ మీడియా ద్వారా రక్షణ: మహిళా అధికారుల నియామకం

సోషల్ మీడియా ద్వారా రక్షణ: మహిళా అధికారుల నియామకం
x
Highlights

ముంబై పోలీసులు 8 మంది మహిళ అధికారులను ఆయా పోలిస్ స్టేషన్‌లకు ఇంచార్జీలుగా నియమించారు. ఈ 8 మంది మహిళా అధికారులు సోషల్ మీడియాను ఫాలో అవుతారు. అంతేకాదు...

ముంబై పోలీసులు 8 మంది మహిళ అధికారులను ఆయా పోలిస్ స్టేషన్‌లకు ఇంచార్జీలుగా నియమించారు. ఈ 8 మంది మహిళా అధికారులు సోషల్ మీడియాను ఫాలో అవుతారు. అంతేకాదు శాంతిభద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని చేరవేస్తారు. మహిళ పోలీసు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తాము ప్రమాదంలో ఉన్నామని సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాదు అవసరమైన జాగ్రత్తలను కూడ సోషల్ మీడియా ద్వారా బాధితులకు చేరవేస్తారు.
దేశంలోనే ఈ తరహ పోలీసులను నియమించడం మహరాష్ట్రలోనే ప్రథమమని ఆ రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది. వినూత్న కార్యక్రమం ద్వారా మహరాష్ట్ర పోలీసు శాఖ రికార్డుల్లోకి ఎక్కింది. ట్విట్టర్‌ను ఈ మహిళా అధికారులు ఫాలో అవుతారు. దీనితో పాటు ఇతర సోషల్ మీడియాను కూడ ఫాలో అవుతారు. నేరస్తులను పట్టుకొనేందుకు వీరంతా ఇతరపోలీసులకు సహకరిస్తారు. అంతేకాదు నేరస్థులను పట్టుకొనేందుకుగాను ఈ మహిళా అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. మహరాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తీసుకొన్న ఈ నిర్ణయాన్ని స్థానిక మహిళా సంఘాల నేతలు అభినందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పోలీసుల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories