బాలయ్య షెడ్యూల్‌ ఏంటి.. తారక్‌ వచ్చే ఛాన్స్‌ ఉందా? 

బాలయ్య షెడ్యూల్‌ ఏంటి.. తారక్‌ వచ్చే ఛాన్స్‌ ఉందా? 
x
Highlights

ఒకవైపు కేసీఆర్‌ ప్రచార దూకుడు పెంచారు. మహాకూటమి మాత్రం క్యాంపెయిన్‌లో వేగం పెంచలేదు. అటు కాంగ్రెస్‌ ఏమో సోనియా గాంధీ సభతో చెలరేగిపోవాలని ప్రణాళిక...

ఒకవైపు కేసీఆర్‌ ప్రచార దూకుడు పెంచారు. మహాకూటమి మాత్రం క్యాంపెయిన్‌లో వేగం పెంచలేదు. అటు కాంగ్రెస్‌ ఏమో సోనియా గాంధీ సభతో చెలరేగిపోవాలని ప్రణాళిక వేస్తోంది. ఇక టీడీపీ కూడా స్టార్‌ క్యాంపెయినర్స్‌తో, తెలంగాణ గట్టుపై సత్తా చాటాలని ఆలోచిస్తోంది. మరి టీడీపీ స్టార్ క్యాంపెయిన్స్ ఎవరు....బాలయ్య షెడ్యూల్ ఏంటి...తారక్‌ వస్తాడా? తెలంగాణ‌ అసెంబ్లీ పోరులో 13 స్థానాల్లో పోటీ చేస్తోంది తెలుగుదేశం. మ‌హాకూట‌మిలో భాగంగా గ‌తంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీతో క‌లిసి టీడిపి ప్రచార వేదిక‌ల‌ను పంచుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ర‌మ‌ణ‌, సీనియ‌ర్ నేత‌లు రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి, పెద్దిరెడ్డిల‌తో పాటూ మ‌రికొంత మందితో స్టార్ క్యాంపెయిన‌ర్స్ లిస్ట్ రెడీ చేశారు. అయితే వీరే కాకుండా ఏపీ సిఎం చంద్రబాబు, బాల‌కృష్ణతో పాటూ లోకేష్ కూడా ప్రచారం చేయ‌నున్నారు.


సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బాల‌కృష్ణ ఈనెల 26 నుంచి ప్రచారానికి స‌మ‌యం కేటాయించ‌నున్నారు. సుహాసిని నామినేష‌న్ కార్యక్రమంలో అంతా తానై వ్యవ‌హరించారు బాల‌య్య.దీంతో నంద‌మూరి అభిమానులతో పాటు టిడిపి కార్యక‌ర్తల్లో పుల్ జోష్ వ‌చ్చింది. మ‌రోప‌క్క జూనియ‌ర్ ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్ మల్టీ స్టార‌ర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా వర్క్‌లో బిజీగా ఉన్నారు. చివ‌రి క్షణంలోనైనా ఒక్క రోడ్ షో అయినా, తారక్‌తో కూక‌ట్‌ప‌ల్లిలో నిర్వహించేందుకు టిడిపి నేత‌లు ప్రయ‌త్నిస్తున్నారు. క‌ళ్యాణ్‌రాంను సైతం ప్రచారానికి తీసుకొచ్చేందుకు తెలుగు త‌మ్ముళ్లు ప్రయ‌త్నిస్తున్నారు.

తెలంగాణ‌లో నామినేష‌న్ల ప్రక్రియ ముగిసిన వెంట‌నే టీడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ అభ్యర్థులు, ముఖ్య నేత‌లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ‌లో టీడిపి హయాంలో జ‌రిగిన అభివృద్దిని ప్రజ‌ల్లోకి తీసుకెళ్ళాల‌ని చంద్రబాబు సూచించారు. అంతేకాదు ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను గట్టిగా తిప్పి కొట్టాల‌ని చెప్పారు. మ‌హాకూట‌మిలోని భాగ‌స్వామ్య పార్టీల‌తో కోఆర్డినేష‌న్ చేసుకుంటూ సంయ‌మ‌నంగా ప్రచారం చేసుకోవాల‌ని చెప్పారు. ఒక‌వైపు టీడిపి పోటీ చేస్తున్న స్థానాల‌తో పాటు, కూట‌మి భాగ‌స్వామ్య పార్టీలు పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా ప్రచారం చేసేందుకు టిడిపి నేత‌లు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories