నేరుగా శ్రీవారి దర్శనం..తీరనున్న క్యూలైన్ కష్టాలు

Highlights

హమ్మయ్యా..తిరుపతి క్యూలైన్ కష్టాలు తీరనున్నట్లు తెలుస్తోంది. టీటీడీ పాలకమండలి తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో...

హమ్మయ్యా..తిరుపతి క్యూలైన్ కష్టాలు తీరనున్నట్లు తెలుస్తోంది. టీటీడీ పాలకమండలి తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలంటే సుమారుగా 3నుంచి 4గంటల సమయం పడుతుంది. పండగల సమయంలో అయితే 10గంటలకి పైగా క్యూలైన్ లో నిలుచుని శ్రీవారి దర్శనానికి వెళ్లాల్సి వచ్చేది. రాను రాను తాకిడి ఎక్కువ కావడంతో కొంతమంది భక్తులు అస్వస్థతకు గురవ్వడం, మరికొంతమంది ప్రాణాలు పోవడంలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ సమస్యని పరిష్కరించి సాధారణ భక్తులు క్యూలైన్ లో నిలబడే అవసరం లేకుండా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కొత్త విధానాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా తిరుమలకి వచ్చే భక్తులు స్లాట్ బుక్ చేసుకోవాలని.. తద్వారా శ్రీవారిని నేరుగా దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందని తెలిపారు. తొలత ఈ ప్రయోగాన్ని డిసెంబర్ రెండో వారం నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పారు. టీటీడీలో 21 ప్రాంతాల్లో స్లాట్ కౌంటర్లను ఓపెన్ చేస్తున్నట్లు ...దర్శనార్దం వచ్చే భక్తులు ఈ స్లాట్ దగ్గరికి వచ్చి బుక్ చేసుకుంటే శ్రీవారి దర్శనం ఎన్నిగంటలకు అవుతుందో అధికారులు చెబుతారని సూచించారు. ఆ సమయానికి వచ్చి భక్తులు శ్రీవారిని క్యూ లైన్ లో వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనం చేసుకోవచ్చు, ఈ టైమ్ స్లాట్ కౌంటర్ లకి వెళ్లని భక్తులు ఇప్పుడు ఉన్నట్లుగానే క్యూ లైన్ వేచి చూస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories