తెలంగాణ నిరుద్యోగులకు డబల్ ధమాకా..

తెలంగాణ నిరుద్యోగులకు డబల్ ధమాకా..
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 8 వేల పైచిలుకు పోలీస్ ఉద్యోగపోస్టులకు గురువారం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం...

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 8 వేల పైచిలుకు పోలీస్ ఉద్యోగపోస్టులకు గురువారం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,786 పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) శనివారం నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు స్పష్టం చేసింది. వీటిలో 700 వీఆర్వో, 474 మండల ప్లానింగ్, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ,అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఏఎస్‌వో, 1,521 గ్రూప్‌–4 పోస్టులు, ఆర్టీసీలో 72 జూనియర్‌ అసిస్టెంట్‌ పర్సనల్, జూనియర్‌ అసిస్టెం ట్‌ ఫైనాన్స్‌ పోస్టులు, రెవెన్యూ విభాగం, హోంశాఖల్లో 19 సీనియర్‌ స్టెనో పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ వెలువడనుంది. కాగా వీటి అర్హత ఇతరత్రా విషయాలు టీఎస్‌పీఎస్సీ వెబ్సైట్లో పేర్కొన్నారు. దీంతో నిరుద్యోగులలో సంతోషం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories