టీ.కాంగ్రెస్‌కు భారీ షాకివ్వనున్న టీఆర్ఎస్‌...ఓ మాజీ డిప్యూటీ సీఎంతో పాటు పది మంది మాజీ ఎమ్మెల్యేలు

టీ.కాంగ్రెస్‌కు భారీ షాకివ్వనున్న టీఆర్ఎస్‌...ఓ మాజీ డిప్యూటీ సీఎంతో పాటు పది మంది మాజీ ఎమ్మెల్యేలు
x
Highlights

ఎన్నికల ఏడాది కారు స్పీడ్‌ పెంచింది. టీఆర్ఎస్‌లోకి వలస జోరు పెరిగింది. మొన్నటి వరకు తెలంగాణ టీడీపీని టార్గెట్‌ చేసిన టీఆర్ఎస్‌... ఈసారి కాంగ్రెస్‌...

ఎన్నికల ఏడాది కారు స్పీడ్‌ పెంచింది. టీఆర్ఎస్‌లోకి వలస జోరు పెరిగింది. మొన్నటి వరకు తెలంగాణ టీడీపీని టార్గెట్‌ చేసిన టీఆర్ఎస్‌... ఈసారి కాంగ్రెస్‌ పార్టీ నేతలకు గాలం వేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఓ మాజీ డిప్యూటీ సీఎంతో పాటు పది మంది మాజీ ఎమ్మెల్యేలను త్వరలోనే కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఆపరేషన్‌ ఆకర్స్‌ మొదటి ఫేజ్‌లో ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌‌నే టీఆర్ఎస్‌ టార్గెట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్‌తోపాటు మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌, ఆయన కుమారుడు కూడా త్వరలోనే టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే పాలమూరు జిల్లా నుంచి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. నాగం జనార్ధన్‌ రెడ్డి రాకతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి... టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories