Top
logo

ఎంపీ మల్లారెడ్డికి పాలాభిషేకం.. ఎందుకు చేశారో చూస్తే..

ఎంపీ మల్లారెడ్డికి పాలాభిషేకం.. ఎందుకు చేశారో చూస్తే..
X
Highlights

ఎంపీ మల్లారెడ్డి అనగానే జనాలకు కొత్తదనం కనిపిస్తుంది. ఈ ఫోటో చూడగానే ఈయనే ఏదో వ్రతం చేస్తున్నారు అనుకుంటే...

ఎంపీ మల్లారెడ్డి అనగానే జనాలకు కొత్తదనం కనిపిస్తుంది. ఈ ఫోటో చూడగానే ఈయనే ఏదో వ్రతం చేస్తున్నారు అనుకుంటే పొరపాటే. పుట్టిన రోజు సందర్బంగా మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి పాలాభిషేకం చేయించుకున్నారు. ఆయనపై పాలు పోసిన అభిమానులు బోలెడంతా ప్రేమను చాటారు. పట్టుపంచె, కండువా కప్పుకొని కూర్చీ మీద కూర్చున్న మల్లారెడ్డికి బకెట్‌ నిండా పాలు తెచ్చి.. చెంబులతో పాలాభిషేకం చేస్తూ ఆయనను పాలమయం చేశారు. అనంతరం పూజారి ఆయనపై అక్షంతలు వేసి ఆశీర్వదించారు. దీంతో అభిమానులు కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

Next Story