Top
logo

చంద్రబాబుకు హరీష్ రావు లేఖాస్త్రం

X
Highlights

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి హరీష్‌రావు లేఖాస్త్రం సంధించారు. 1. సాగు నీటి ప్రాజెక్టులను...

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి హరీష్‌రావు లేఖాస్త్రం సంధించారు.

1. సాగు నీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర చేయలేదా ?
2. పాలమూరు కడతామని హామి ఇచ్చి మళ్లీ అడ్డుపడలేదా ?
3. కాళేశ్వరం ప్రాజెక్టుపై మీరు విషం చిమ్మింది నిజం కాదా ?
4. పాలేరు ప్రాజెక్టుకు నీళ్లివ్వడాన్ని కూడా మీరు అడ్డుకోలేదా ?
5. కేసీ కెనాల్ కోసం తుమ్మిళ్ల వద్దంటారా ?
6. కల్వకుర్తిపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా ?
7. పోలవరానికి బదులుగా కృష్ణా నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడడం లేదా ?
8. శ్రీశైలం నుంచి తెలంగాణకు నీరివ్వొద్దనడం కుతంత్రం కాదా ?
9. ఎవరి అనుమతితో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు ?
10. పోలవరం మండలాలు గుంజుకోవడం మొదటి అన్యాయం కాదా ?
11. సీలేరు ప్లాంట్ పోవడం వల్ల ఏడాదికి 500 కోట్లు నష్టం చేయడం లేదా ?
12. విద్యుత్ పంపిణీ విషయంలో దుర్మార్గమైన వైఖరి అవలంభించలేదా ?
13.పీపీఏలను ఏకపక్షంగా రద్దు చేసి 2,465 మెగావాట్లు ఎగ్గొట్టలేదా ?
14. రూ 4,557 కోట్లు నష్టం చేసిన కుటిలత్వం మీది కాదా ?
15.ఇవ్వాల్సిన టెండర్లు ఇవ్వకుండా టెండర్లలో పాల్గొన్న కుంచితత్వం మీది కాదా ?
16. ఆంధ్ర ఉద్యోగులను రుద్ది వెయ్యి కోట్ల భారం మోపలేదా ?
17. ఖాళీ భవనాలు ఇవ్వకపోవడం మీ సంకుచితత్వం కాదా ?
18. ‍హైదరాబాద్ ఆస్తుల్లో వాటా అడగడం మీ దురాశ కాదా ?
19. విభజన మాయని గాయం అని బాధపడలేదా ?

Next Story