త్వరలోనే టీజేఎస్ ఖాళీ అవుతుంది - హరీష్‌రావు

x
Highlights

టీజేఎస్ అధినేత కోదండరామ్ టార్గెట్‌గా మంత్రి హరీష్‌ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యమాన్ని అవహేళన పార్టీలతో నాలుగు సీట్ల కోసం కోదండరామ్‌...

టీజేఎస్ అధినేత కోదండరామ్ టార్గెట్‌గా మంత్రి హరీష్‌ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యమాన్ని అవహేళన పార్టీలతో నాలుగు సీట్ల కోసం కోదండరామ్‌ జతకట్టారన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన తమను మాత్రం శత్రువులుగా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌, టీడీపీలు కోదండరామ్‌ను ఎలా అవమానించారో గుర్తు చేసుకోవాలంటూ సూచించారు. కాంగ్రెస్, టీడీపీ నేతల నుంచి కోదండరామ్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్న చరిత్ర టీఆర్ఎస్‌దేన్నారు. సంగారెడ్డి జిల్లా టీజేఎస్ నేతలకు పార్టీ కండువ కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. కోదండరామ్ పార్టీ త్వరలోనే ఖాళీ అవుతుందంటూ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో టీఆర్ఎస్ అధికారం చేపడుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories