తీవ్ర విషాదంలో వైసీపీ ఎమ్మెల్యే

తీవ్ర విషాదంలో వైసీపీ ఎమ్మెల్యే
x
Highlights

నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. అయన మృతితో నందమూరి...

నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. అయన మృతితో నందమూరి అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే తీవ్ర విషాదంలో ఉన్నారు. నందమూరి ఫ్యామిలీకి నాని అత్యంత సన్నిహితులు. అందునా హరికృష్ణకు నాని బాగా సన్నిహితంగా ఉండేవారు. హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు నాని వద్దకు ఎక్కువగా వెళుతుండేవారు. నానిని ఎన్టీఆర్ అన్నగా భావించేవారు. నందమూరి కుటుంబంలో ఏ కార్యక్రమమైనా ఎమ్మెల్యే నాని వుండాలసిందే. చాలా సార్లు హరికృష్ణ , నానీల మధ్య సినిమా ప్రస్తావన కూడా వచ్చింది. వారిద్దరూ కలిసి ఎన్టీఆర్ హీరోగా సినిమాను నిర్మించాలని అప్పట్లో అనుకున్నారు. కానీ నాని, వల్లభనేని వంశి లు కలిసి 'సాంబ' చిత్రాన్ని నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories