logo
జాతీయం

ఆ రైళ్లలో ప్రయాణం చేసే వారికి చేదు వార్త!

ఆ రైళ్లలో ప్రయాణం చేసే వారికి చేదు వార్త!
X
Highlights

ప్లాట్ ఫామ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది సెంట్రల్‌ రైల్వే ఈనెల 30 నుంచి వచ్చే నెల 3 వ తేదీ వరకు...

ప్లాట్ ఫామ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది సెంట్రల్‌ రైల్వే ఈనెల 30 నుంచి వచ్చే నెల 3 వ తేదీ వరకు తాత్కాలికంగా నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నట్టు సెంట్రల్‌ రైల్వే నాగపూర్ రైల్వే అధికారులు తెలిపారు. దీంతో సికింద్రాబాద్‌-నాగపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌: 12771)ను మే 30వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు నాగపూర్‌ స్టేషన్‌కు బదులుగా అజ్ని స్టేషన్‌ వరకు నడుపుతున్నారు. అంతేకాదు నాగపూర్‌-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌: 12772)ను మే 31వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు నాగపూర్‌ స్టేషన్‌కు బదులుగా అజ్ని స్టేషన్‌ నుంచి బయల్దేరుతుంది. ఇక ముంబై సీఎస్‌టీఎం-నాగపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌: 11401)ను మే 28వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు నాగపూర్‌ స్టేషన్‌కు బదులుగా అజ్ని స్టేషన్‌ వరకు నడపబడుతోంది. అలాగే నాగపూర్‌-ముంబై సీఎస్‌టీఎం (రైల్‌ నెంబర్‌: 11402) మే 31వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు నాగపూర్‌ స్టేషన్‌ నుంచి కాకుండా అజ్ని స్టేషన్‌ నుంచి బయల్దేరుతుదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో నాగపూర్ ప్రయాణికులకు కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశముంది.

Next Story