logo
జాతీయం

భారత్‌లో అత్యంత వేగవంతమైన రైలు ఇదే..

భారత్‌లో అత్యంత వేగవంతమైన రైలు ఇదే..
X
Highlights

దేశ తొలి ఇంజన్ రహిత సెమీ హైస్పీడ్ రైలు ‘ట్రైన్ 18’ ఈ రైలు 18గంటలకు 180 కిలోమీటర్ల వేగంతో దేశంలోనే అతివేగవంతమైన ...

దేశ తొలి ఇంజన్ రహిత సెమీ హైస్పీడ్ రైలు ‘ట్రైన్ 18’ ఈ రైలు 18గంటలకు 180 కిలోమీటర్ల వేగంతో దేశంలోనే అతివేగవంతమైన రైలుగా నిలిచింది. ట్రయల్ రన్ 18 విజయవంగా ఈ వేగాన్ని అందుకుందని భారత రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయాల్ నిర్థారిస్తూ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా నమోదైందని పీయూశ్ తన ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. కాగా ఈనెల డిసెంబర్29న వారణాసిలో ఈ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించున్నారు. ఇక ఈ రైలు ప్రత్యేకతలు అత్యాధునిక, విలాసవంతమైన సదుపాయాలను రైల్వేశాఖ ఏర్పాటుచేసింది. రైలు మొత్తం పూర్తి ఏసీతో ఉంటుంది. ఆటోమేటిక్ డోర్స్, ఆన్ బోర్డ్ వైఫై, జీపీఎస్ ఆధారిత సమాచార వ్యవస్థ, ఇంకా పలు రకాల సౌకర్యాలు ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. ఈ హైడ్ స్పీడ్ రైలు ఢిల్లీ స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు పయనమై పగలు 2 గంటలకు వారణాసి చేరుకుంటుంది. మళ్లీ తిరిగి వారణాసి నుంచి రాత్రి 2.30 గంటలకు బయలుదేరి ఉదయం 10.30 గంటలకు ఢిల్లీకి చేరుతుందని అధికారులు వెల్లడించారు.

Next Story