వరంగల్‌లో ఆ 4 సీట్లు ఎందుకు హాట్‌ ఫేవరేట్‌?

x
Highlights

ఈ ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆ నాలుగు స్దానాల్లో హోరాహోరీ తప్పదా కాంగ్రెస్, టీఆర్ఎస్, ఢీ అంటే ఢీ అంటున్నాయా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠపై...

ఈ ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆ నాలుగు స్దానాల్లో హోరాహోరీ తప్పదా కాంగ్రెస్, టీఆర్ఎస్, ఢీ అంటే ఢీ అంటున్నాయా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠపై బెట్టింగ్‌లు సైతం జోరు మీద సాగుతున్నాయా అసలు టఫ్‌ వార్‌కు కారణమేంటి ఎలాంటి సమీకారణాలు సమరాన్ని రసవత్తరంగా మారుస్తున్నాయి వరంగల్ జిల్లాలో అ రెండు పార్టీల మద్య నాలుగు సీట్ల ఫైట్‌పై స్పెషల్‌ స్టోరి.

రాజకీయ సంచనాలకు మారు పేరు ఉమ్మడి వరంగల్ జిల్లా. బలమైన నాయకులు, రసవత్తర పాలిటిక్స్‌కు కేరాఫ్. ఈ ఎన్నికల్లోనూ అందరిదృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. పరకాల, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్‌లలో, ఈ రెండు పార్టీల మధ్య పోరు, టగ్‌ ఆఫ్‌ వార్‌ను తలపిస్తోంది. ఈ నాలుగు చోట్ల కూడా రెండు పార్టీలు బలమైన నేతలను ప్రకటించడం, సామాజిక వర్గాలు స్దానిక పరిస్దితులు ఇలా అన్ని కోణాల్లో చూసినా, ఇక్కడ పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాపై ఆశలు పెట్టుకున్న రెండు పార్టీల నేతలు, చాలెంజ్‌గా తీసుకున్నాయి. దీంతో అందరి చూపు ఆ నియోజకవర్గాలపైనే ఉంది.

ఈ నాలిగింటిలో ముందు వరుసలో ఉన్నది పరకాల నియోజకవర్గం. ఇక్కడ ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్దిగా చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్దిగా కొండా సురేఖ ఉన్నారు. బిజేపి అభ్యర్ది కూడా ఇక్కడ బలంగా ఉండటంతో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఇక్కడ అభ్చర్దుల బలాబలాలు చూసినట్లయితే, నాలుగేళ్ళుగా కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనకు కలిసివస్తాయనే దీమాలో ఉన్నారు టీఆర్ఎస్ అభ్యర్ది. మరోవైపు కొండా సురేఖ కాంగ్రెస్ అభ్యర్దిగా బరిలో నిలిచారు. ఆమె గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలుపొందారు. మరోవైపు గ్రామీణ ప్రాంతం కావడం, మహిళల్లో జనాదరణ కలిగిన నేతగా కొండా సురేఖ, తన భర్త కొండా మురళీధర్‌ రావు స్వంత బలాన్ని నమ్మకుని గెలుపుపై ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు కూడా తనకు కలిసివస్తాయని లెక్కలేస్తున్నారు.

ఇక పాలకుర్తి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల ప్రచారం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. హ్యాట్రిక్ సాధించేందుకు తాజామాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు చెమటోడుస్తున్నారు. గతంలో టిడిపిలో తిరుగులేని నేతగా ఉన్న ఎర్రబెల్లి, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ప్రజాకూటమి నుంచి జంగా రాఘవరెడ్డి పోటీలో నిలిచారు. గతంలో డిసిసిబి బ్యాంక్ ఛైర్మన్‌గా చేసిన అనుభవం, రైతులతో ఉన్న అనుబంధం, టీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేక ఓటు, టీడీపీ, కాంగ్రెస్‌ ఓట్ల బదలాయింపు, ఇలా అనేక లెక్కలతో రాఘవ రెడ్డి దీమాగా కనిపిస్తున్నారు. సామాజిక వర్గాల వారిగా చూసినా ఇక్కడ వెలమ, రెడ్ల ఆధిక్యం ఉంటుంది. దీంతో రెండు పార్టీలు కుడా నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి.

డోర్నకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్దిగా రెడ్యానాయక్, కాంగ్రెస్ అభ్యర్దిగా జాటోతు రాంచంద్రునాయక్ తలపడుతున్నారు. ఇక్కడ తిరుగులేని నేతగా ఉన్న రెడ్యానాయక్, ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న రెడ్యానాయక్, ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి చేరారు. గిరిజన నేతగా మంచి పట్టు ఉన్న నాయకుడు. ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న రాంచంద్రునాయక్ వృత్తిరిత్యా డాక్టర్. స్దానికంగా అందరికీ సూపరిచితుడు. ఆదివాసిల్లో టీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను క్యాష్‌ చేసుకుని గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ రెడ్యా నాయక్, రామచంద్ర నాయక్‌ల మధ్య టఫ్‌ ఫైట్‌ తప్పదన్న చర్చ సాగుతోంది.

మహబుబాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల సమరం అలాఇలా లేదు. ఇక్కడి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ టీఆర్ఎస్ అభ్యర్దిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, సై అంటున్నారు. గతంలో అక్కడ ఎంపీగా పని చేసిన అనుభవం ఉంది. అక్కడి గిరిజనుల్లో, నియోజకవర్గంలో మంచి పట్టునేత బలరాం నాయక్. మరోవైపు టీఆర్ఎస్ పథకాలు, కేసిఆర్‌పై ఉన్న ప్రజాబలంతో గెలుస్తాం అనే ధీమాతో శంకర్ నాయక్ ఉన్నారు. ఇద్దరు కుడా లంబాడి సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్యా టగ్‌ ఆఫ్‌ వార్‌ తప్పేలా లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories