ట‌చ్ చేసి చూడు మూవీ క‌లెక్ష‌న్స్

ట‌చ్ చేసి చూడు మూవీ క‌లెక్ష‌న్స్
x
Highlights

రెండేళ్ల గ్యాప్ త‌రువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామ‌హ‌రాజ త‌నకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రల‌తో అల‌రిస్తున్నాడు. అయితే విక్ర‌మ్ సిరికొండ...

రెండేళ్ల గ్యాప్ త‌రువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామ‌హ‌రాజ త‌నకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రల‌తో అల‌రిస్తున్నాడు. అయితే విక్ర‌మ్ సిరికొండ డైర‌క్ష‌న్ లో ప‌వ‌ర్ ఫుల్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ట‌చ్ చేసి చూడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.
అయితే వ‌రుస హిట్ల‌తో మాంచి స్వింగ్ లో ఉన్న ర‌వితేజ ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకొని క‌లెక్ష‌న్లు వ‌స్తాయ‌ని ఊహించారు. కానీ క‌థా , పేల‌వ‌మైన క‌థ‌నంతో సినిమా ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లు నామ‌మంత్రంగానే వ‌సూళ్లు కొన‌తున్నాయి.
సినిమా పేరుతో హిట్ కొడుతుంద‌ని అందురు భావించారు. కొత్త సీసాలో పాత సారా అన్నచందంగా రొటీన్ స్టోరీ, టేకింగ్ లో లోపాలతో సినిమా ఫ‌స్ట్ వీక్ నుంచే నెగిటీవ్ రిపోర్ట్ వ‌చ్చింది. సినిమాపై నెగిటీవ్ కామెంట్స్ రావ‌డంతో రానురాను వ‌సూళ్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. నార్మ‌ల్ గా ఉన్న ఈ వ‌సూళ్లు మ‌రోవారందాకా కొన‌సాగితే డిజాస్టర్ అవుతుందా లేక బిలో యావరేజ్ గా మిగులుతుందా అనేది తేలనుంది.
ఇక ఈ వ‌సూళ్లు ఎలా ఉన్నాయ‌నే విష‌యానికొస్తే మొదటి రోజు 8.7 కోట్ల గ్రాస్ తో 4.95 కోట్లు, నైజాంలో 2.5 కోట్ల గ్రాస్ తో 1.6 షేర్, సీడెడ్ లో 70 లక్షల గ్రాస్ తో 48 లక్షలు,వైజాగ్ లో 50 లక్షలు ,ఈస్ట్ నుంచి 45 లక్షలు, వెస్ట్ నుంచి 30 లక్షలు, కృష్ణలో 23 లక్షలు, గుంటూర్ లో 47 లక్షలు, నెల్లూరులో 20 లక్షలు , కర్ణాటకలో కోటి రూపాయల గ్రాస్ తో కేవలం 40 లక్షల షేర్ రాగా, ఓవర్సీస్ లో మాత్రం 80 లక్షల గ్రాస్ తో నిరాశకలిగే విధంగా 24 లక్షలు మాత్రమే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల లోపే షేర్ రావడం పూర్తి నిరాశ కలిగించేదే.

Show Full Article
Print Article
Next Story
More Stories