logo
సినిమా

హిట్ కన్ఫామ్.....లాజిక్ వెనకున్న మ్యాజిక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

X
Highlights

టాలీవుడ్ టాప్ హీరోలు పండగ చేసుకుంటున్నారు వచ్చిన హిట్లనుచూసి కాదు రాబోయే బ్లాక్ బస్టర్లని చూసి బేసిగ్గా పెద్ద...

టాలీవుడ్ టాప్ హీరోలు పండగ చేసుకుంటున్నారు వచ్చిన హిట్లనుచూసి కాదు రాబోయే బ్లాక్ బస్టర్లని చూసి బేసిగ్గా పెద్ద హీరోల సినిమాలకు అంచనాలే భారంగా మారుతాయనే భయం ఉంటుంది...కాని ఇక్కడ అంతా రివర్స్ ఒకటి కాదు రెండు కాదు, అరడజన్ బ్లాక్ బస్టర్స్ అంటూ ముందే ఫేట్ ని డిసైడ్ చేస్తున్నారు సినీజనం అదెలా?

టాలీవుడ్ లో ఇంకా సెట్స్ పైకెళ్లకముందే హిట్ కన్ఫామ్ చేసుకున్నమూవీ త్రిబుల్ ఆర్ అంటే రాజమౌళి మేకింగ్ లో చెర్రీ, తారక్ చేయబోతున్న మల్టీస్టారర్. అసలే బాహుబలితో ఓరేంజ్ లో ఇండియన్ సినిమాని ఊపేసిన దర్శకుడు ఫేల్యూర్స్ లేని స్టార్ డైరక్టర్ మరో వైపు 4 హిట్లతో దూసుకుపోతోన్న ఎన్టీఆర్, రంగస్థలం హిట్ తో స్వింగ్ లోఉన్న చెర్రీ ఎటుచూసినా అన్నీ మంచి శకునాలే అందుకే సెట్స్ పైకెళ్లకముందే హిట్ గ్యారెంటీ అంటున్నారు.

మెగా స్టార్ చిరంజీవి హీరోగా, సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న మూవీ సైరానరసింహా రెడ్డి 300 కోట్ల హెవీ బడ్జెట్. ఖైదీ నెంబర్ 150 హిట్ తర్వాత వస్తోన్న సినిమా బేసిగ్గా ఇలాంటి సిచ్చువేషన్ లో అంచనాల భారమే తలనొప్పవ్వాలి కాని సైరా హిట్ కన్ఫామ్ అంటున్నారు. నయనతార, తమన్నా లాంటి హీరోయిన్లు బాలీవుడ్ మార్కెట్ ని ఆకట్టుకునేందుకు అమితాబ్, కోలీవుడ్ మార్కెట్ కోసం విజయ్ సేతుపతి, వీటితోపాటు తొలి స్వాతంత్ర సమరయోధుడి కథ అలానే చిరంజీవి తోపాటు, వార్ సీన్స్ ఇన్ని ఉన్నాయి కాబంటే ఆ ఎమోషన్ తో కాసులవర్షం కురిసే ఛాన్స్ ఉందనంటున్నారు.

300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కతోన్నమరో తెలుగు మూవీ సాహో బాహుబలితో వండర్స్ క్రియటే్ చేశాడు కాబట్టే, ప్రభాస్ నెక్ట్స్ మూవీకి అంచానాల భారం తలనొప్పవ్వాలి కాని మొన్న మేకింగ్ టీజర్ వదిలాక, ఫిల్మ్ టీంలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఏమాత్రం పర్లేదన్న టాక్ వచ్చినా, హిట్ అయినట్టే అన్న మాట వినిపిస్తోంది ప్రభాస్ క్రేజ్ సౌత్ నార్త్ మొత్తం ఏరేంజ్ లో ఉందో టీజర్ కొచ్చిన రెస్పాన్స్ బట్టి చూస్తే అర్థమౌతోంది

టాలీవుడ్ లో రిలీజ్ కి ముందే హిట్ ని కన్ఫామ్ చేసుకున్న మరో మూవీ ఎన్టీఆర్ బయోపిక్స్ అసలు టాలీవుడ్ లెజెంట్ ఎన్టీఆర్ రియల్ స్టోరీ అంటేనే ఎక్కడ లేని క్యూరియాసిటీ...దీనికి తోడు రెండు భాగాలుగా రాబోతోన్న సినిమా, అలానే రానా, విద్యా బాలన్, నిత్యామీనన్, శ్రీదేవిగా రకుల్ ఇలా ఇంతమంది ఇన్ని పాత్రలు పోషిస్తోంటే, వెండితెర వెలిగిపోవాల్సిందే అందుకే కథానాయకుడు, మహానాయకుడు రెండు భాగాలకు సక్సెస్ మినిమమ్ గ్యారెంటీ అంటున్నారు.

త్రివిక్రమ్ మేకింగ్ లో బన్నీ సినిమా అనగానే హిట్ కన్ఫామ్ చేశారు వరుస ఫెల్యూర్స్ లో ఉన్న అల్లు అర్జున్ కి, త్రివిక్రమ్ కాంబినేష్ కలిసొచ్చేదే అనే అభిప్రాయముంది. రీజన్ జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ మూవీలు వీళ్ల కాంబినేషన్ లో వచ్చినవే దీనికి తోడు అరవింద సమేత వీర రాఘావ తో త్రివిక్రమ్ మళ్లీ ఫాం లోకి వచ్చాడు కాబట్టే, ఈసారి బన్నీతో త్రివిక్రమ్ కి, సీన్ రిపీటే అంటున్నారు.

Next Story