Top
logo

తిరుచానూరులో పంచమీ తీర్ధ మహోత్సవం

Highlights

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు పంచమీ తీర్ధ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ...

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు పంచమీ తీర్ధ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పద్మసరోవరం పుష్కరిణిలో వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో అమ్మవారి విగ్రహానికి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం జరిపారు. కాగా, అమ్మవారి జన్మదినం కావటంతో చక్రస్నానాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారి సారెను తిరుచానూరుకు అర్చకులు ఊరేగింపుగా తీసుకొస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి ఎంతటి ప్రాముఖ‌్యత ఉంటుందో తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పంచమీ తీర్ధానికి అంతటి ప్రాముఖ్యత ఉంది.

Next Story