లేళ్ల అప్పిరెడ్డి మార్పు ఇందుకేనా?

లేళ్ల అప్పిరెడ్డి మార్పు ఇందుకేనా?
x
Highlights

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్షంగా వైసీపీ అధినేత అడుగులేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర అంటూ రాష్ట్రాన్ని చుట్టేస్తున్న అయన యాత్రలోనే ఎవరెవరికి సీట్లు...

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్షంగా వైసీపీ అధినేత అడుగులేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర అంటూ రాష్ట్రాన్ని చుట్టేస్తున్న అయన యాత్రలోనే ఎవరెవరికి సీట్లు ఇచ్చేది, ఇవ్వనిది మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగతంగా బలంగా ఉన్న నేతలను సైతం నియోజకవర్గాలు మార్చుకోవలసిందిగా జగన్ సూచిస్తున్నారు. ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై దృష్టిసారించిన జగన్ అక్కడ ఇంఛార్జిగా ఉన్న వంగవీటి రాధాను కాకుండా బ్రాహ్మణ సామజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంఛార్జిగా నియమించారు. ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణులు అధికశాతం ఉన్నారన్న కారణంతో మల్లాదిని రంగంలోకి దించారు . అయితే వంగవీటి రాధ ఈ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ప్రస్తుతం రాజకీయంగా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇక ఇదే సూత్రాన్ని గుంటూరు జిల్లాలో సైతం పాటిస్తున్నారు జగన్. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మెన్ లేళ్ల అప్పిరెడ్డి.

అయితే ఈ ఎన్నికల్లో మళ్ళీ సీటు గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. అనూహ్యంగా ఈ నియోజకవర్గానికి ఇంచార్జ్ గా కొత్తగా చేరిన చంద్రగిరి ఏసు రత్నంను నియమించారు జగన్. ఈ సీటు విషయంలో జగనే కాకుండా పార్టీ నేతలు సైతం ఒక అంచనాకు వచ్చారట.. ఇక్కడ ఎక్కువగా ఎస్సి సామజిక వర్గం ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత కాపులు, బీసీలు ఉండగా వారి తరువాతి స్థానాల్లో కమ్మ, రెడ్డి సామజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. దాంతో జగన్ తన సామజికవర్గం రెడ్డి కాబట్టి.. వారి ఓట్లు ఎలాగూ వైసీపీకి పడతాయని భావించి.. అక్కడ ఎస్సి నేతకు అవకాశం ఇస్తే.. వారి ఓట్లలో అధికశాతం వైసీపీకి వేస్తారనే భావనలో జగన్ ఉన్నారట. పైగా ఇంఛార్జిగా నియమింపబడ్డ ఏసురత్నానికి పార్టీలకతీతంగా స్నేహసంబంధాలున్నాయి. గెలుపు సంగతి అటుంచితే గట్టి పోటీ అయితే ఉంటుందని జగన్ అలాగే గుంటూరు నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంనుంచి ప్రధాన పార్టీలన్నీ అగ్రవర్ణాలకే సీటు ఇస్తాయని తద్వారా తాము ఎస్సీలకు అవకాశం కల్పించామన్న గుర్తింపు వస్తుంది.. కనుకనే వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories