logo
సినిమా

మూడు వారాలు .. మూడు సినిమాలు..

మూడు వారాలు .. మూడు సినిమాలు..
X
Highlights

'ఊహ‌లు గుస‌గుస‌లాడే' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ త‌రువాత 'జోరు', 'జిల్‌',...

'ఊహ‌లు గుస‌గుస‌లాడే' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ త‌రువాత 'జోరు', 'జిల్‌', 'శివ‌మ్‌', 'బెంగాల్ టైగ‌ర్‌', 'సుప్రీమ్‌', 'హైప‌ర్' చిత్రాల‌తో సంద‌డి చేసింది. తాజాగా ఎన్టీఆర్‌కి జోడీగా 'జైల‌వ‌కుశ‌'లో మెరిసింది. కేవ‌లం తెలుగు చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ రాశి న‌టిస్తోంది. కాగా, రాశి న‌టించిన మూడు చిత్రాలు అక్టోబ‌ర్ నెల‌లో విడుద‌ల‌కి సిద్ధ‌మ‌య్యాయి. ఆ చిత్రాలే 'రాజా ది గ్రేట్‌', 'విల‌న్‌', 'ఆక్సిజ‌న్‌'.

ర‌వితేజ హీరోగా న‌టించిన 'రాజా ది గ్రేట్' అక్టోబ‌ర్ 12న రిలీజ్ కానుంది. ఇందులో రాశి అతిథి పాత్రలో మెర‌వ‌నుంది. ఇక 'విల‌న్' విష‌యానికొస్తే.. ఇదో మ‌ల‌యాళ చిత్రం. మోహ‌న్‌లాల్‌, విశాల్‌, హ‌న్సిక‌తో క‌లిసి రాశి ఖ‌న్నా ఇందులో న‌టించింది. వ‌చ్చే నెల 19న ఈ సినిమా మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. వీటితో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 'ఆక్సిజ‌న్' కూడా అక్టోబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ నెల 27న రానున్న ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా న‌టించాడు. వ‌రుస‌గా మూడు వారాల పాటు వివిధ భాష‌ల్లో సంద‌డి చేయ‌నున్న రాశికి వీటిలో ఏ సినిమా స‌క్సెస్‌ని అందిస్తుందో చూడాలి.

Next Story