జగన్ కు మూడంచెల భద్రత..

జగన్ కు మూడంచెల భద్రత..
x
Highlights

విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం నేపథ్యంలో.. ఆయనకు ఆంధ్రప్రదేశ్...

విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం నేపథ్యంలో.. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రతను పెంచింది. ఈ మేరకు జగన్ పాదయాత్ర సందర్బంగా ఆయనకు మూడంచెల భద్రత కల్పిస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ పాలరాజు తెలిపారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన ఘటన నేపథ్యంలో ఇకపై నిర్వహించే పాదయాత్రకు మూడంచెల భద్రత కల్పిస్తామని వివరించారు. పాదయాత్రలో జగన్‌ చుట్టూ వలయం ఏర్పాటు చేస్తామని, అందులోకి ముందుగా అనుమతి తీసుకున్న వారి నడవడికను పరిశీలించాకే పంపిస్తామని తెలిపారు. అనుమతి లేని వ్యక్తులను ఎవరినీ మూడంచెల భద్రతా వలయంలోకి పంపించే ప్రసక్తే లేదని ఎస్పీ పాలరాజు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories