logo
జాతీయం

అరుదైన దృశ్యం : మూడు పాముల సయ్యాట

అరుదైన దృశ్యం : మూడు పాముల సయ్యాట
X
Highlights

సాధారణంగా మనం రెండు పాములు పెనవేసుకుని ఉండటాన్ని చూసి ఉంటాం.. కానీ మూడు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని...

సాధారణంగా మనం రెండు పాములు పెనవేసుకుని ఉండటాన్ని చూసి ఉంటాం.. కానీ మూడు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని నాట్యమాడటం అరుదుగా జరుగుతుంటుంది. మూడు పాములు కలిసి నాట్యమాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఈ
ఘటన తమిళనాడులోని రామనాధపురం జిల్లా పరమకుడి అరసడివండల్ అనే గ్రామ సమీపంలోని పొలంలో వెలుగుచూసింది. ఇందులో మూడు పాములు ఒకదాని తరువాత మరొకటి వచ్చాయి. ఆ తరువాత మూడు కలిసి పెనవేసుకున్నాయి. అనంతరం గంటకు పైగానే నాట్యమాడుతూ చూపరులకు కనువిందు చేశాయి. ఆ మూడు పాములు కలిసి మెలికలు తిరుగుతూ రెండు మూడు అడుగులు ఎత్తుకు లేచి నాట్యమాడే సయ్యాటను తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు గ్రామస్థులు. ఈ విన్యాసాలు సాదరణమే అయినా మూడు పాములు నాట్యం చేయటంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.

Next Story