logo
సినిమా

తొలిప్రేమ : రివ్యూ

తొలిప్రేమ : రివ్యూ
X
Highlights

నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌ తారాగ‌ణం: వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా, సుహాసిని, సప్న ప‌బ్బి,...

నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
తారాగ‌ణం: వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా, సుహాసిని, సప్న ప‌బ్బి, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ ఆది, విద్యుల్లేఖా రామన్ త‌దిత‌రులు
కూర్పు: న‌వీన్ నూలి
సంగీతం: ఎస్‌.త‌మ‌న్‌
ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి

‘ఫిదా’ చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించాడు మెగా హీరో వరుణ్ తేజ్. కెరియర్ స్టార్టింగ్‌లో డిఫరెంట్ జానర్స్‌లో వైవిధ్య పాత్రలు చేసినా.. ఫిదా చిత్రంలో లవర్ బాయ్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో మళ్లీ ప్రేమకథా చిత్రంతోటే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుణ్ తేజ్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి సినిమాపై అంద‌రిలో కాస్త క్యూరియాసిటి పెరిగింది. అందుకు కార‌ణం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కెరీర్ బ్రేక్ మూవీ తొలిప్రేమ టైటిల్‌తో అబ్బాయి వ‌స్తుండ‌ట‌మే. అలాంటి టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన వ‌రుణ్ తేజ్‌కి ఈ ‘తొలిప్రేమ‌’ ఎలాంటి విజ‌యాన్నిచ్చిందో తెలుసుకుందాం.

క‌థ‌: లండన్ లో ఉంటున్న ఆదిత్య (వరుణ్ తేజ్) తన ఫెయిల్యూర్ లవ్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ప్లస్ 2 టైంలో ట్రైన్ జర్నీలో వర్ష (రాశి ఖన్నా)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు ఆదిత్య. ఆ తర్వాత ఇద్దరు సేం కాలేజ్ లో జాయిన్ అవుతారు. ఆదిత్య లవ్ ప్రపోజల్స్ కు ఓకే చెప్పేస్తుంది వర్ష. ఇంతలోనే ఇద్దరు పరిస్థితుల కారణంగా విడిపోవాల్సి వస్తుంది. మళ్లీ 6 ఏళ్ల తర్వాత కలుస్తారు.. అప్పుడు మళ్లీ ఇద్దరు ప్రేమించుకుంటారు.. ఇంతకీ వర్ష, ఆదిత్య లవ్ యాక్సెప్ట్ చేసిందా..? వారిద్దరు ఎందుకు విడిపోతారు..? అన్నది సినిమా కథ.

విశ్లేష‌ణ‌: ఫిదాలో ఎన్నారై యువ‌కుడిగా, ప‌రిణితితో కూడుకున్న పాత్ర‌లో క‌న‌ప‌డ్డ వ‌రుణ్ తేజ్ ఈ సినిమా ల‌వ‌ర్‌బోయ్ పాత్ర‌లో భిన్నంగా క‌న‌ప‌డ్డాడు. ప్రేమ‌, విడిపోవ‌డం అనే సంద‌ర్భాల్లో వ‌చ్చే బాధ‌ను.. వేరియేష‌న్స్‌ను త‌న క్యారెక్ట‌ర్‌లో వ‌రుణ్ చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. వ‌ర్ష పాత్ర‌లో రాశీ ఖ‌న్నా చ‌క్క‌గా చేసింది. పాత్ర కోసం స‌న్న‌బ‌డ‌టం.. కొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌టం పెద్ద ప్ల‌స్ అనే చెప్పాలి. రాశి త‌న కెరీర్‌లోనే బెస్ట్ రోల్ చేసింది. త‌న హావ‌భావాలు, కారులోని రొమాంటిక్ సీన్ అన్నీ యూత్‌ను, సగటు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది. స‌ప్న ప‌బ్బి పాత్ర చిన్న‌దే అయినా ఉన్నంతలో మెప్పించింది. బ‌జ‌ర్‌ద‌స్త్‌ ఆది, సుహాసిని, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌తో మెప్పించారు.

మంచి ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ. ప్రేమ క‌థ అంటే ప్రేమికులు క‌లుసుకోవ‌డం.. విడిపోవ‌డం.. మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం అనే పాయింట్ కామ‌న్‌గానే ఉంటుంది. ఇలాంటి ప్రేమ‌ క‌థ‌ల్లో ఎమోష‌న్స్‌, ఫీల్ అనేది ముఖ్యం. ఈ సినిమాలో అవి మిస్ కాకుండా చూసుకున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. సినిమా ప్రారంభ‌మైన కాసేప‌టికే ప్రేక్ష‌కులు ఆ ఫీల్‌కి లోన‌వుతారు. ఫ‌స్టాఫ్ అంతా ఓ ఫీల్‌తో ర‌న్ అవుతుంది. అయితే సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే.. మాత్రం స‌న్నివేశాల‌ను లాగిన‌ట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ ఎఫెక్టివ్‌గా ఉండాల‌నిపించింది. సెకండాఫ్ నెరేష‌న్ ఫ్లాట్‌గా అనిపించింది. అయితే సెకండాఫ్‌లో ప్రేమ‌కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి కథ కథనాల్లో తన ప్రతిభ కనబరిచాడు. తొలిప్రేమ లాంటి టైటిల్ కు ఎలాంటి కథ అవసరమో అదే కథతో వచ్చాడు. కథ పాతదే అనిపించినా కథనంలో ఫీల్ బాగా వర్క్ అవుట్ చేశాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఫారిన్ లొకేషన్స్ బాగా క్యాప్చర్ చేశారు. తమన్ మ్యూజిక్ కూడా కొత్తగా ఉంటుంది. ఎడిటింగ్ ఒకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

బ‌లాలు:
వరుణ్ తేజ్
రాశి ఖన్నా
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
ఫస్ట్ హాఫ్

బ‌ల‌హీన‌త‌లు:
క్లైమాక్స్
సెకండ్ హాఫ్

Next Story