కేసీఆర్ సారథ్యంలో.. థర్డ్ ఫ్రంట్.. సాధ్యమేనా?

కేసీఆర్ సారథ్యంలో.. థర్డ్ ఫ్రంట్.. సాధ్యమేనా?
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంపై కాకమీదున్నారు. ఆ ఆవేశంలో.. ఆయన థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఢిల్లీలో...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంపై కాకమీదున్నారు. ఆ ఆవేశంలో.. ఆయన థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఢిల్లీలో పర్యటించినపుడు కూడా.. కేసీఆర్ ఇదే పనిపై కసరత్తు చేసినట్టు సమాచారం అందుతోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో జాతీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్న కేసీఆర్.. నాటి స్నేహాన్ని ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ దిశగా వాడుకుంటున్నట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేంద్రం రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న మొత్తంలో.. కేవలం 42 శాతమే తిరిగి ఇస్తూ.. మిగిలిన 58 శాతం డబ్బును ఇష్టారాజ్యంగా కేటాయిస్తోందంటూ .. చాలా కాలం నుంచి కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ.. ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం దెబ్బ తీస్తోందని ఆరోపిస్తూ.. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు వేశారన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇప్పటికే.. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్.. డీఎంకే నేత స్టాలిన్.. జేడీఎస్ నేత కుమారస్వామి.. జేఎంఎం నేత శిబూ సోరెన్ తో పాటు.. ఇక్కడ మన దగ్గర పవన్ కల్యాణ్ ను కూడా కేసీఆర్ ఇప్పటికే దగ్గరికి తీశారు. అందరితో చర్చల్లో.. థర్డ్ ఫ్రంట్ విషయమే ప్రాధాన్యమని.. ఎవరి నుంచి కూడా ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత రాలేదని తెలుస్తోంది. దీంతో.. ముందు ముందు.. ఈ దిశగా అడుగులు పడితే.. కాంగ్రెస్, బీజేపీలకు జాతీయ స్థాయిలో ఇబ్బంది తప్పదన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories