logo
సినిమా

మూడో ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా?

మూడో ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా?
X
Highlights

ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుల్లో శ‌ర్వానంద్ ఒక‌డు. 'ర‌న్ రాజా ర‌న్‌', 'మళ్లీ మ‌ళ్లీ ఇది...

ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుల్లో శ‌ర్వానంద్ ఒక‌డు. 'ర‌న్ రాజా ర‌న్‌', 'మళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శ‌త‌మానం భ‌వ‌తి' చిత్రాల‌తో ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోగ‌ల‌డ‌న్న పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ 'మ‌హానుభావుడు' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. శ‌ర్వానంద్‌తో ఇప్ప‌టికే 'ర‌న్ రాజా ర‌న్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన యువి క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ‌ర్వానంద్‌, యువి క్రియేష‌న్స్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి వ‌స్తున్న ఈ ప్ర‌య‌త్నం.. ఏ మేర‌కు ఫ‌లిస్తుందో తెలియాలంటే విజ‌య‌ద‌శ‌మి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Next Story