logo
సినిమా

అప్పుడు మ‌హాల‌క్ష్మీ.. ఇప్పుడు మేఘ‌న‌..

అప్పుడు మ‌హాల‌క్ష్మీ.. ఇప్పుడు మేఘ‌న‌..
X
Highlights

'కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ' చూసిన వారెవ‌రైనా అందులో మ‌హాలక్ష్మీ పాత్ర‌లో న‌టించిన మెహ‌రీన్‌ని అంత ఈజీగా...

'కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ' చూసిన వారెవ‌రైనా అందులో మ‌హాలక్ష్మీ పాత్ర‌లో న‌టించిన మెహ‌రీన్‌ని అంత ఈజీగా మరిచిపోలేరు. అంత‌గా త‌న అందంతో, అభిన‌యంతో క‌ట్టిప‌డేసిందీ పంజాబీ ముద్దుగుమ్మ‌. ఆ సినిమా విడుద‌లై ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం పూర్త‌యినా ఆమె నుంచి మ‌రో సినిమా రాలేదు. అయితేనేం.. ఇప్పుడు ఈ చిన్న‌ది న‌టించిన నాలుగు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. ఆ చిత్రాలే 'మ‌హానుభావుడు', 'రాజా ది గ్రేట్‌', 'c/o సూర్య‌', 'జ‌వాన్‌'. వీటిలో ముందుగా రాబోతున్న సినిమా 'మ‌హానుభావుడు'.

శ‌ర్వానంద్‌, మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రంలో కూడా అందం, అభిన‌యంకి స్కోప్ ఉన్న పాత్ర‌లో మెహ‌రీన్ క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. 'మ‌హానుభావుడు'లో మేఘ‌న అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్న మెహ‌రీన్‌.. మ‌హాల‌క్ష్మీలాగే గుర్తుండిపోయే పాత్ర‌ ఇద‌ని చెప్పుకొస్తోంది. ఈ నెల 29న 'మ‌హానుభావుడు' రిలీజ్ కానుంది.

Next Story