ఆ కారణంతోనే చంద్రబాబును పిలవలేదు : నారా లోకేష్
Highlights
గత వారం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రపంచ పారిశ్రామికుల సదస్సు (జీఈఎ) కు, తన తండ్రి ఆంధ్రప్రదేశ్...
admin12 Dec 2017 5:34 AM GMT
గత వారం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రపంచ పారిశ్రామికుల సదస్సు (జీఈఎ) కు, తన తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఆహ్వానించక పోవడంపై ఏపీ ఐటి మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.. ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. జీఈఎస్ సదస్సు జరిగింది తెలంగాణ రాష్ట్రంలోనని, కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో సదస్సు జరపాలని నిర్ణయించుకుందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే పిలుస్తుందని చెప్పారు. జీఈఎస్‌కు చంద్రబాబును మాత్రమే కాదని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందలేదని లోకేశ్ స్పష్టం చేసారు.. ఆ కారణంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆహ్వానం లేదని అందులో ఒకరాష్ట్రాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఏముందని లోకేష్ చెప్పుకొచ్చారు.
Next Story