సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత

X
Highlights
విజయవాడలోని సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇబ్రహింపట్నం వాసులు సీఎం ఇంటిని...
arun28 Dec 2017 5:19 AM GMT
విజయవాడలోని సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇబ్రహింపట్నం వాసులు సీఎం ఇంటిని ముట్టడించారు. కిరోసిన్ డబ్బాలతో ఇంటికి చేరుకున్న ఆందోళన కారులు నిరసనకు దిగారు. తమ నివాసాలు అన్యాయంగా ఖాళీ చేయించి తమను మోసం చేశారంటూ ఆరోపించారు. ఈ విషయం మంత్రి దేవినేని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మనస్థాపం చెందిన ఓ బాదితుడు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బాధితుడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Next Story