వైసీపీ, టీడీపీలో ఉత్కంఠ..!

వైసీపీ, టీడీపీలో ఉత్కంఠ..!
x
Highlights

వైసీపీ, టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. గడిచిన నాలుగేళ్లలో ఈరోజు అంతలా టెన్షన్ పడని తెలుగుదేశంపార్టీ నేడు కాస్తంత ఉలికిపాటుకు లోనవుతోంది. ఆంధ్రప్రదేశ్...

వైసీపీ, టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. గడిచిన నాలుగేళ్లలో ఈరోజు అంతలా టెన్షన్ పడని తెలుగుదేశంపార్టీ నేడు కాస్తంత ఉలికిపాటుకు లోనవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ ఎంపీలు రాజీనామా పదవులకు చేశారు. రాజీనామాలపై చర్చించేందుకు నేడు(మంగళవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు వైసీపీ ఎంపీలు. సాయంత్రం నాలుగున్నర తరువాత వారు స్పీకర్ ను కలిసి అవకాశముంది. స్పీకర్ మొదటగా వీరి రాజీనామాలను వెనక్కితీసుకునేలా సూచిస్తుంది. అలా కాకుండా తమ రాజీనామాలు ఆమోదించాలని పట్టుబడితే మాత్రం ఇవాళ లేదా వారం పది రోజుల్లో వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీంతో వైసీపీ సభ్యులు తమ రాజీనామాలు ఆమోదింపజేసుకుంటారా లేక వెనక్కి తగ్గుతారోనన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందోనని టీడీపీలో చర్చ మొదలైంది. ప్రత్యేక హోదా విషయంలో మంత్రిపదవులు వదులుకున్న టీడీపీకి కాకుండా వైసీపీ ఎంపీలు ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తారోనని ఉలిక్కిపడుతుననట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories