logo
సినిమా

బిగ్‌బాస్‌-2 ఫైనల్‌ లిస్ట్‌ ఇదే!

బిగ్‌బాస్‌-2 ఫైనల్‌ లిస్ట్‌ ఇదే!
X
Highlights

ఈరోజు (ఆదివారం) నుంచి ప్రారంభమవుతున్న బిగ్‌బాస్‌ రెండవ సీజన్ కు కంటెస్టెంట్లు ఫైనల్ అయ్యారని ఓ వార్త వైరల్...

ఈరోజు (ఆదివారం) నుంచి ప్రారంభమవుతున్న బిగ్‌బాస్‌ రెండవ సీజన్ కు కంటెస్టెంట్లు ఫైనల్ అయ్యారని ఓ వార్త వైరల్ అవుతోంది. నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కు సంబంధించి మొత్తం 12 మంది కంటెస్టెంట్ల లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వారి లిస్ట్ చూస్తే..

1. సింగర్‌ గీతా మాధురి.. టాలీవుడ్‌ పాపులర్‌ సింగర్‌
2. తేజస్వి మదివాడ... టాలీవుడ్‌లో చాలా చిత్రాల్లో నటించిన నటి.
3. నటుడు అమిత్‌ తివారీ.. విక్రమార్కుడు, ఖలేజా, అత్తారింటికి దారేది, టెంపర్‌ , సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాల్లో నటించాడు.
4. నటుడు తనీష్‌.. బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోగా కనిపించాడు.
5. నటుడు సామ్రాట్‌... అహనా పెళ్లంట, పంచాక్షరి లాంటి చిత్రాల్లో కనిపించారు.
6. యాంకర్‌ దీప్తి... ఓ ప్రముఖ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న దీప్తి నల్లమోతు. భద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ చిత్రాల్లో నటించారు.
7. బాబు గోగినేని... హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌.
8. రోల్‌ రిడా... రాహుల్‌ కుమార్‌ అలియాస్‌ రోల్‌ రిడా. రాప్‌ సింగర్‌.
9. శ్యామల... యాంకర్‌ శ్యామల. పలు చిత్రాల్లో కూడా నటించారు.
10. కిరీటి ధర్మరాజు... పలు షార్ట్‌ ఫిలింస్‌. టాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.
11. దీప్తీ సునయన... సోషల్‌ మీడియా సెన్సేషన్‌. డబ్‌ స్మాష్‌ వీడియోల‌తో బాగా పాపులర్‌.
12. సీరియల్‌ నటుడు కౌశల్‌

Next Story