సోషల్ మీడియా వచ్చాక భారత్ లో టీవీ చూసే వారి సంఖ్య ఎంతంటే..

సోషల్ మీడియా వచ్చాక భారత్ లో టీవీ చూసే వారి సంఖ్య ఎంతంటే..
x
Highlights

రానురాను టెక్నాలజీలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అప్పట్లో టీవీ ఉంటేనే ప్రపంచంలో, సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటిది ప్రస్తుతం సోషల్...

రానురాను టెక్నాలజీలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అప్పట్లో టీవీ ఉంటేనే
ప్రపంచంలో, సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటిది ప్రస్తుతం సోషల్ మీడియా రావడంతో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏ దిక్కు ఏమి జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. అంతేకాదు టీవీ కంటే ముందుగానే ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియా ఉన్నా టీవీ.. టీవీనే అంటున్నారు జనాలు. సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక కూడా టీవీకి ఆదరణ తగ్గలేదంటున్నాయి కొన్ని సంస్థలు. సామాజిక మాధ్యమాలు(సోషల్ మీడియా) ఎన్ని వచ్చినా టీవీ చూసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉందని,అందులోనూ దక్షిణ భారతీయులు ఈ విషయంలో ముందున్నారని తాజా సర్వేలో తేలింది. బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బార్క్‌) నిర్వహించిన సర్వేలో దక్షణాది రాష్ట్రాల్లో 95శాతం ఇళ్లలో టీవీలు ఉన్నట్టు తేలింది. మొత్తం 4,300 పట్టణాల్లో 3 లక్షల మందిని సర్వే చేయగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 25 కోట్ల 90 లక్షల టీవీలు ఉన్నాయి. 2016తో పోలిస్తే ఈ ఏడాది 8శాతం ఎక్కువగా నమోదయింది. ఇక ఉత్తర భారతంలో 20.9 కోట్లు, పశ్చిమ భారతంలో22.1 కోట్లు, తూర్పు భారతంలో14.6 కోట్ల టీవీలు ఉన్నాయి.దేశం మొత్తం మీద టీవీ ప్రేక్షకుల సంఖ్య 66శాతం ఉండగా, దక్షిణ భారత దేశంలో అది 95 శాతంగా ఉంది. దేశంలో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 2018లో19.7 కోట్లకు చేరింది.2016తో పోలిస్తే ఇది 7.5% ఎక్కువ.దేశంలో టీవీ ప్రేక్షకుల సంఖ్య కూడా83.6 కోట్లకు చేరింది గతంలో కంటే 7 శాతం ఎక్కువగా నమోదైంది. పట్టణాల్లో ప్రతి పది మందిలో ఎనిమిది మంది రోజులో 4 గంటల పది నిముషాలు టీవీ చూస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో3 గంటల 27 నిముషాలు టీవీ చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories