ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ఆత్మహత్య

ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ఆత్మహత్య
x
Highlights

ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ రాధికా కౌశిక్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తను ఉండే అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్థు నుంచి పడి ఆమె చనిపోయినట్టు ప్రాథమిక...

ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ రాధికా కౌశిక్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తను ఉండే అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్థు నుంచి పడి ఆమె చనిపోయినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. శుక్రవారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళితే నోయిడా సెక్టార్‌ 77లోని అంతరిక్ష ఫారెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న జీ రాజస్థాన్ ఛానల్ న్యూస్ యాంకర్ రాధికా కౌశిక్ నాలుగో అంతస్థు నుండి కిందపడి చనిపోయింది. ఈ ఘటన చోటుచేసుకోకముందు తన స్నేహితుడు, కో యాంకర్ రాహుల్ అవస్థితో కలిసి అర్ధరాత్రి జోరుగా పార్టీ చేసుకున్నారు. దానికి సంబంధించి మద్యం బాటిల్లు ఉన్నాయి. అయితే తాను బాత్రూమ్‌లో ఉన్నప్పుడు రాధిక కింద పడిపోయిందని రాహుల్ పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో ముగినిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories