logo
జాతీయం

ఏపీ కోసం తెలంగాణ యువకుడు పోరాటం

ఏపీ కోసం తెలంగాణ యువకుడు పోరాటం
X
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఓ యువకుడు టవరెక్కాడు. ఢిల్లీ మెట్రో భవన్ సమీపంలోని ఓ సెల్ టవర్ పై ఎక్కి...

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఓ యువకుడు టవరెక్కాడు. ఢిల్లీ మెట్రో భవన్ సమీపంలోని ఓ సెల్ టవర్ పై ఎక్కి నిరసనకు దిగాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేతిలో బ్యానర్ పట్టుకుని నినాదాలు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎక్కిన వ్యక్తి వరంగల్‌కు చెందిన ఉమేష్ రెడ్డిగా గుర్తించారు. అతనిని కిందికి దించేందుకు ఢిల్లీ పోలీసులు యత్నిస్తున్నారు. అయితే తాను కాంగ్రెస్ అభిమానిననీ..5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడుతున్నానని ఉహేష్ రెడ్డి చెబుతున్నాడు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడిస్తే గానీ టవర్ దిగేది లేదని అతను మొండికేస్తున్నాడు. ప్రస్తుతం ఉమేష్ రెడ్డితో ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

Next Story