తొడగొట్టే నేతలు... తొందరపడుతున్నారా!!

తొడగొట్టే నేతలు... తొందరపడుతున్నారా!!
x
Highlights

నల్గొండ నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. కానీ ప్రభుత్వం మాత్రం టిఆర్ఎస్ ఏర్పాటు చేసింది. దీంతో అవకాశం కోసం...

నల్గొండ నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. కానీ ప్రభుత్వం మాత్రం టిఆర్ఎస్ ఏర్పాటు చేసింది. దీంతో అవకాశం కోసం కోమటిరెడ్డి వెంటఉన్న నేతలు ...అధికార టిఆర్ఎస్‌లో అప్పటి ..నల్గొండ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇంచార్జ్ దుబ్బాక నర్సింహ్మారెడ్డి అధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన వారిలో, నల్గొండ జడ్పీటిసి, నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు చాలామంది సర్పంచులు, ఎంపీటిసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. అయితే గతేడాది టిడిపి నుంచి టిఆర్ఎస్ లో జాయిన్ అయిన కంచర్ల భూపాల్ రెడ్డికి ...నల్లగొండ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగించారు. దీనిని రాజకీయంగా జీర్ణించుకోలేకపోయిన...దుబ్బాక నర్సింహ్మారెడ్డి వర్గం ...కంచర్ల వర్గానికి పూర్తిగా దూరం జరిగింది. భూపాల్ రెడ్డి నిర్వహించే పార్టీ కార్యక్రమాలను దూరం పెట్టారు.

ఇలా రాజకీయం నడుస్తుండగానే ..ప్రభుత్వం రద్దు కావడం ...ముందస్తు ఎన్నికల వచ్చిన నేపథ్యంలో ...నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్ధిగా కంచర్ల భూపాల్ రెడ్డిని టిఆర్ఎస్ ప్రకటించింది. దీంతో కంచర్లను మార్చాలని దుబ్బాక నర్మింహ్మారెడ్డి తన అనుచరులతో కలిసి అసమ్మతి సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ టిఆర్ఎస్ అధిష్టానం అభ్యర్ధి మార్పు లేదని చెప్పడంతో, దుబ్బాక వర్గం టిఆర్ఎస్ ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉంటోంది. దీంతో కంచర్ల భూపాల్ రెడ్డి ...టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన క్యాడర్‌ను పార్టీలో జాయిన్ చేసుకుంటూ, ఆ ప్రభావం కనపడకుండా జాగ్రత్తపడుతున్నారు.

దుబ్బాక సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకున్న నేతలు, దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇపుడు ...కాంగ్రెస్ లోకి వలస బాట పట్టారు. ఇప్పటికే నల్గొండ జడ్పీటిసితో పాటు, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ...పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు ...కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు ప్రతిరోజు పదుల సంఖ్యలో కొంతమంది టిఆర్ఎస్ లో...మరికొంతమంది కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇలా చేరికలను అటు కంచర్ల భూపాల్ రెడ్డి ...ఇటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వెళ్లేపుడు ...హంగు ఆర్భాటాలతో వెళ్లినవారు ...అదే ఆర్భాటంతో కాంగ్రెస్ లో చేరుతున్నారు. అటు కాంగ్రెస్ ,టిడిపిలనుంచి నేతలు సందడిగా, టిఆర్ఎస్ భూపాల్ రెడ్డి సమక్షంలో జాయినవుతున్నారు. ఇలా ప్రతిరోజు రెండు పార్టీల మధ్య చేరికల అంశం, నియోజకవర్గంలో రాజకీయంగా హాట్ హాట్ గా మారింది ...

మొత్తంగా నెలన్నర నుంచి జిల్లాలో రాజకీయ పరిస్ధితులు పూర్తిగా వేడెక్కాయి. చేరికలతో తనకు ఈసారి గెలుపు నల్లేరుపై నడికేనని కోమటిరెడ్డి అంటుంటే ....కోమటిరెడ్డి ఇరవై ఏళ్లుగా చేయని అభివృద్ది తనకు కలిసి వస్తుందని ...అందుకే పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని కంచర్ల భూపాల్ రెడ్డి సమావేశాల్లో చెప్పుకొస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా, నియోజకవర్గంలోనూ హోరాహోరీగా టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ...వరుస జాయినింగ్స్ లతో ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. దీంతో నెలన్నర నుంచి ఎవరు ఏపార్టీలో ఉన్నారో అర్ధం కాని పరిస్ధితి నియోజకవర్గ ప్రజలకు ఎదురవుతోంది. దీనికి తోడు కొంతమంది అసమ్మతి నేతలు సైతం, రెండు పార్టీల నేతల ప్రచారాలకు దూరంగా ఉంటుండటం, నియోజకవర్గ ప్రజలను మరింత కన్ఫ్యూజన్ కు గురిచేస్తోంది. అది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని, నేతలు టెన్షన్‌పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories