తెలంగాణ జనసేనా.. జనసమితా? ఏపీ సీఎం ఎందుకలా అన్నారు!!

తెలంగాణ జనసేనా.. జనసమితా? ఏపీ సీఎం ఎందుకలా అన్నారు!!
x
Highlights

రౌండ్ ది క్లాక్ పని.. నిరంతర సమావేశాలు.. ఎన్నికల కోలాహలం.. పాతమిత్రుల దూరం.. కొత్త మిత్రుల చేరిక.. నేతలను కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి.. అందుకే ఎవరేం...

రౌండ్ ది క్లాక్ పని.. నిరంతర సమావేశాలు.. ఎన్నికల కోలాహలం.. పాతమిత్రుల దూరం.. కొత్త మిత్రుల చేరిక.. నేతలను కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి.. అందుకే ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి.. ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పేస్తున్నారు.. టిడిపి అధినేత చంద్రబాబు ఖమ్మంలో చేసిన ప్రసంగం చివరిలో మహాకూటమి నేతలను పేరు పేరునా ప్రస్తావించిన సందర్భంలో కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జన సమితిని చంద్రబాబు తెలంగాణ జనసేన అంటూ ప్రస్తావించారు..

పరధ్యాన్నంలోనే చంద్రబాబు ఇలా కామెంట్ చేసేశారా? ఏపీలో ఒకప్పుడు మిత్రుడుగా ఉన్న పవన్ కల్యాణ్ జనసేన ఈసారి ప్రతిపక్షంగా ఎన్నికల బరిలో నిలుస్తోంది. రెండు పార్టీల మధ్యా స్నేహం చెడి ఓ రేంజ్ లో విమర్శలు కూడా పెరిగిపోయాయి.. ఏపీలో జనసేనను విమర్శించి విమర్శించి చంద్రబాబు తెలంగాణకు వచ్చినా అదే పేరు ఆయన నోట్లో నానుతోందో ఏమో.. తెలంగాణ జన సమితి అనబోయి తెలంగాణ జనసేన అని కామెంట్ చేశారు.. దీన్ని అలవాటులో పొరపాటనుకోవాలేమో..

Show Full Article
Print Article
Next Story
More Stories