ములుగు, నారాయణపేట్ కేంద్రంగా జిల్లాల ఏర్పాటుకు కసరత్తు...ఇది కేసీఆర్ లక్కీ నంబర్ అని...

x
Highlights

తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం...

తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను రెవెన్యూ శాఖ ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 31 జిల్లాలకు తోడు మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ములుగు, నారాయణపేట్ కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ములుగు రెవెన్యూ డివిజన్‌తో ప్రత్యేక జిల్లా, నారాయణపేట్ రెవెన్యూ డివిజన్‌తో పాటు, కోయిల్ కొండ మండలంతో నారాయణపేట్ జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూపాలపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్ల నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది.

రెండు కొత్త జిల్లాలతో పాటు మరో 2 రెవెన్యూ డివిజన్లు ఇంకొన్ని కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. కోరుట్ల, కొల్లాపూర్ కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే నల్గొండ జిల్లాలో గట్టుప్పల్ మండలం, ములుగు జిల్లాలో మల్లంపల్లి, బాన్సువాడ నియోజకవర్గంలో చండూర్‌, మోస్రా, మహబూబాబాద్ నియోజకవర్గంలో ఇనుగుర్తి, సిద్దిపేట జిల్లాలో నారాయణరావు పేట, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో మరో మండలం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని భూ పరిపాలనా శాఖ కార్యాలయం కలెక్టర్లను ఆదేశించింది. అలాగే జనగాం జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు గుండాల మండలాన్ని బదలాయించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.

ములుగును జిల్లా చేసే ప్రతిపాదనల పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు. అయితే మహబూబాబాద్ జిల్లాలోని పాకాల, కొత్తగూడ, గంగారాం మడలాలను ములుగు జిల్లాలో కలపాలని కోరుతూ ప్రధాని కార్యదర్శికి వినతి పత్రం అందచేశారు. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా సీతక్క డిమాండ్ చేశారు. రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలోని జిల్లాల సంఖ్య 33 కాబోతోంది. రెండు మూళ్ళు 3 కలిపితే ఆరు సంఖ్య వస్తుందని ఇది కేసీఆర్ లక్కీ నంబర్ అని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories