శ్రీరస్తు.. శుభమస్తు... ముందస్తు!! గెలుపు ధీమాపై ఇదీ అసలు లెక్క!

శ్రీరస్తు.. శుభమస్తు... ముందస్తు!! గెలుపు ధీమాపై ఇదీ అసలు లెక్క!
x
Highlights

ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో కేసీఆర్‌కు తనదైన వ్యూహముంది. తప్పనపరిస్థితుల్లో కాంగ్రెస్సూ సిద్దమైంది. మిగతా రాజకీయ పార్టీలూ సై అంటున్నాయి. కానీ...

ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో కేసీఆర్‌కు తనదైన వ్యూహముంది. తప్పనపరిస్థితుల్లో కాంగ్రెస్సూ సిద్దమైంది. మిగతా రాజకీయ పార్టీలూ సై అంటున్నాయి. కానీ ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలకూ, ఈ ఎన్నికలపై పక్కాగా ఓ లెక్కుంది. ఏంటది? మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌‌లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. అయితే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఓ రేంజ్‌లో వెల్లువెత్తుతోంది. ఉప ఎన్నికల ఫలితాలే కాదు, తాజా సర్వేలు కూడా కమలానాథులకు టెన్షన్‌ పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ పెద్దల్లో జోష్‌ నింపుతున్నాయి. త్వరలో జరగనున్న ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి, లోక్‌సభ పోరుకు సమరోత్సాహంతో వెళ్లాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అదే మోడీ, అమిత్‌ షాలను కంగారుపెట్టిస్తోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికలతో సరిగ్గా ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్‌పైనే ప్రయోగించాలన్నది బీజేపీ విరుగుడు వ్యూహంగా పొలిటికల్ పండితుల విశ్లేషణ. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్.

తెలంగాణ శాసన సభ ఎన్నికలను తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ పెద్దలు చాలా వ్యూహాలు వేశారన్నది విశ్లేషణలు సాగుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ఎలాగూ అధికారంలోకి రాదు కాబట్టి, కాంగ్రెస్‌ ఓడిపోవడం ద్వారా, దాని దూకుడుకు కళ్లెం వేయొచ్చని కాషాయ వ్యూహకర్తల స్ట్రాటజీ. అంటే వ్రతం చెడ్డా, ఫలితం దక్కాలన్నది మోడీ, షాల మదిలోని మాట. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్‌ వరుసగా రెండోసారి ఓటమిపాలయితే, ఆ పార్టీ పని అయిపోయిందనే ప్రచారాన్ని ఆ తర్వాత జరిగే నాలుగు రాష్ట్రాలు, పార్లమెంట్ ఎన్నికల్లో మరింత ముమ్మరం చేయాలన్నది బీజేపీ భావనగా విశ్లేషకులు చెబుతున్నారు.

నాలుగు రాష్ట్రాలతో పాటే, ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ లెక్కలేస్తుంటే, దానికంటే ముందే జరగొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. ఫలితాలు కూడా వెంటనే వెలువడే ఛాన్సుంది. ఇదే ఆలోచనలోనే ఉన్న మోడీ ప్రభుత్వం, ముందస్తుకు కేసీఆర్‌ అడిగిన వెంటనే ఓకే చెప్పడం, జోనల్‌ వ్యవస్థకు ఆమోదం మొదలైన అంశాలకు ఆమోదం వేసిందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి, ఒకానొక దశలో జమిలీ ఎన్నికలను తెరపైకి తెచ్చారు మోడీ. ఒకవేళ ఆ 4 రాష్ట్రాలకు లోక్‌సభతోపాటే ఎన్నికలు జరిగితే, జాతీయ అంశాలే ఎక్కువ ప్రభావం చూపిస్తాయని, తద్వారా, తాము బయట పడవచ్చని కాషాయ అగ్రనేతలు ఆలోచించారన్న విశ్లేషణలు జోరు మీద సాగాయి. అయితే, జమిలి ఎన్నికల నిర్వహణకు కావాల్సినన్ని వనరులు లేవని ఎలక్షన్ కమిషన్ చేతులెత్తేసింది. చట్టపరమైన అడ్డంకులూ ఆటంకంగా పరిణమించాయి. దాంతో, ఆ నాలుగు రాష్ట్రాలకూ విడిగా ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది. ఇటువంటి పరిస్థితుల్లోనే, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, తమకు అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు బీజేపీ పెద్దలు.

తెలంగాణలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉందన్నది బీజేపీ పెద్దల అంచనా. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణలోనూ కాంగ్రెస్‌ వరుసగా రెండోసారి ఓడిపోతే, ఆ ప్రభావం ఎక్కువగానే ఉంటుందనేది వారి లెక్క. ఇక్కడా కాంగ్రెస్ ఓడిపోతే, నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని, సార్వత్రిక ఎన్నికల్లోనూ డీలా పడుతుందని అనుకుంటున్నారు. అయితే, తెలంగాణలో ఫలితాలు ఎలా ఉన్నా, ఉత్తరాది రాష్ట్రాలపై ఆ ప్రభావం ఉండదని రాజకీయ విశ్లేషకుల భావన. చూడాలి, ఎవరి అంచనా నిజమవుతుందో...

Show Full Article
Print Article
Next Story
More Stories