Top
logo

ప్రారంభమైన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం

ప్రారంభమైన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
X
Highlights

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి...

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులంతా హాజరయ్యారు. అసెంబ్లీ రద్దుపై కాసేపట్లో మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనుంది. శాసనసభను రద్దు చేస్తున్నట్టు ఏక వాక్య తీర్మానం చేసిన అనంతరం మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ రాజ్‌భవన్ వెళ్లనున్నారు. గవర్నర్‌తో భేటి అయి అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని తెలియజేయనున్నారు. అనంతరం మంత్రులతో కలిసి గన్ పార్క్ చేరుకోనున్న ఆ‍యన అమర వీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించనున్నారు. అక్కడి తెలంగాణ భవన్‌కు చేరుకుని తాజా రాజకీయ పరిణామాలపై మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Next Story