Top
logo

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం

X
Highlights

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అన్నివర్గాలకు వరాలు కురిపిస్తోంది. అందులో భాగంగా బీసీలకు ఆత్మగౌరవ...

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అన్నివర్గాలకు వరాలు కురిపిస్తోంది. అందులో భాగంగా బీసీలకు ఆత్మగౌరవ భవనాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాల కోసం 75 ఎకరాల భూమి, 70 కోట్ల రూపాయల నిధులను కేబినెట్ ఆమోదించినట్టు చెప్పారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్. గతంలో అనేక సంవత్సరాలుగా ఈ కులాలు వెయ్యి, రెండువేల గజాల కోసం దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయమని చెప్పారు. వారి ఆర్థిక పరిపుష్టికోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని గోపాలమిత్రల వేతనాలను 8,500 పెంచారు.

Next Story