పండుగ పూట పప్పన్నమేనా? బిర్యానీ ఇస్తేనే ప్రచారానికి వస్తారట!!

పండుగ పూట పప్పన్నమేనా? బిర్యానీ ఇస్తేనే ప్రచారానికి వస్తారట!!
x
Highlights

సాదాసీదా భోజనం అయితే, ప్రచారానికి వచ్చేది లేదు. హైదరాబాద్‌ ధమ్ బిర్యానీ కావాలి. ఘుమఘుమలాడే, వేడివేడి బిర్యానీ ఇవ్వాలి. ఇదీ అభ‌్యర్థుల వెంట,...

సాదాసీదా భోజనం అయితే, ప్రచారానికి వచ్చేది లేదు. హైదరాబాద్‌ ధమ్ బిర్యానీ కావాలి. ఘుమఘుమలాడే, వేడివేడి బిర్యానీ ఇవ్వాలి. ఇదీ అభ‌్యర్థుల వెంట, ప్రచారానికి తిరిగే కార్యకర్తలు, రోజూ కూలీల డిమాండ్. ప్రచానికి జనం కరువు కావడంతో, వీరు కోరినవన్నీ ఇచ్చేందుకు ఓకే అంటున్నారు అభ‌్యర్థులు. కానీ ఖర్చు తడిసి మోపెడవుతోందని, లోలోపల సణక్కుంటున్నారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో, ప్రతి అభ్యర్థి వెంటా భారీ సంఖ్యలో జనం వస్తున్నారు. ఎన్ని పార్టీలున్నా, చివరికి స్వతంత్ర అభ‌్యర్థి అయినా, వారి వెంట జనం బాగానే ఉంటున్నారు. వీరిలో పార్టీ కార్యకర్తలతో పాటు రోజూవారి కూలీలూ ఉంటారు. భారీగా జనం ఉంటేనే, ప్రజల్లో క్రేజ్‌ వస్తుందని, వేరే ఊర్ల నుంచీ రప్పించుకుంటున్నారు. మరి వీరికి కూలితో పాటు, టిఫిన్‌, టీలు, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు వండివార్చాల్సిందే. కానీ అభ్యర్థుల వెంట తిరుగుతూ, జేజేలుకొట్టే వారంతా మామూలు పప్పన్నం భోజనం వద్దంటున్నారట. బిర్యానీ ఉంటే తప్ప వచ్చేదిలేదని తెగేసి చెబుతున్నారట. లేదంటే బిర్యానీ ఇచ్చే పార్టీవైపు ప్రచారానికి వెళతామని అంటున్నారట. అసలే జనాలు దొరక్క, కొరత ఏర్పడిన నేపథ్యంలో, చేసేదేమీలేక, వారు కోరినట్టే బిర్యానీలే వడ్డిస్తున్నారు. దీంతో జేబులు ఖాళీ అవుతున్నాయని లోలోల కుమిలిపోతున్నారు అభ్యర్థులు.

ఇలా వండి పెట్టిన బిర్యాని అయితే నాయకులకు కొద్ది ఖర్చుతో కూడుకున్న పని. కాని, చాలా మంది కార్యకర్తలు తమకు హోటళ్ల నుంచి తెచ్చిన స్పెషల్ బిర్యానీలు కావాలంటున్నారు. ఉదయం టిఫిన్ తప్పితే... మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా బిర్యాని కావాలని పట్టుపడుతున్నారు. దీంతో అప్పటికప్పుడు బిర్యానీలు వండలేక, ఆన్‌లైన్‌లో ఆర్డర్లు చేస్తున్నారు అభ్యర్థులు. దీంతో ఆన్‌లైన్‌‌లో 25, 50, ఆపైన పార్శిళ్లకు ఆర్డర్లు చేస్తున్నారు. దీనితో హోటళ్లు, రెస్టారెంట్లు బిర్యానీ ఆర్డర్‌లతో కిక్కిరిసి పోతున్నాయి. ఆన్‌లైన్‌ ధరలు తడిసిమోపెడవుతున్నా, వారిని ఎలాగైనా ఖుషీ చేయాలన్న ఆలోచనతో, బిర్యానీలకు ఆర్డర్లిస్తున్నారు.

మొత్తానికి ప్రచారానికి వచ్చే కార్యకర్తలు, జనాల కోసం తెగ ఖర్చు చేస్తున్నారు అభ్యర్థులు. బిర్యానీలు తినిపిస్తూ, ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. పెద్ద నాయకుల రోడ్‌ షోలు, సభలకు భారీగా తరలించి, బలప్రదర్శన చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ సంస్థలు, అలాగే రెస్టారెంట్లు బిర్యానీ ఆర్డర్లతో కళకళలాడుతున్నాయి. ఎన్నికల ఎఫెక్ట్‌తో చికెన్, మటన్‌ షాపుల్లో మాంసం త్వరగా అమ్ముడుపోతుండటంతో, సామాన్యులకు దొరకడం లేదు. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ, బిర్యానీలు త్వరగా అయిపోతుండటంతో, ఆన్‌లైన్‌లో మామూలూ జనాలకు దొరకడం లేదు. ఈ మూడు, నాలుగు రోజుల్లో బిర్యానీ బిజినెస్‌ మరింత పెరిగే ఛాన్సుంది. మొత్తానికి బిర్యానీ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటళ్లు, ఆన్‌లైన్‌ సంస్థలు పండగ చేసుకుంటున్నాయి. అభ్యర్థులకు మాత్రం ఖర్చు తడిసిమోపెడవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories