రేపటితో ముగియనున్న సర్పంచుల పదవీకాలం..

రేపటితో ముగియనున్న సర్పంచుల పదవీకాలం..
x
Highlights

తెలంగాణలో సర్పంచుల పదవీకాలం రేపటితో(ఆగస్టు 1) ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 12 వేల గ్రామములకు ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. సాధారణంగా సర్పంచుల...

తెలంగాణలో సర్పంచుల పదవీకాలం రేపటితో(ఆగస్టు 1) ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 12 వేల గ్రామములకు ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. సాధారణంగా సర్పంచుల పదవీకాలం ముగిసే కొద్ది రోజుల ముందే ఎన్నికలు నిర్వహించే ఆనవాయితీ ఉంది. కానీ రాష్ట్ర ప్రభత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నా.. కోర్టు పరిధిలో రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉన్న కారణంగా జాప్యం జరుగుతోందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్ట్ గైడ్ లెన్స్ ప్రకారం అన్నివ‌ర్గాల రిజ‌ర్వేష‌న్లు 50 శాతం క‌న్నా మించాయంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించ‌డంతో.. ఎన్నిక‌ల వ్యవహారం కంచికి చేరింది. ఇప్పుడు బీసి గ‌ణ‌న చెయ్యాల‌ని స‌ర్కార్ నిర్ణయించినా.. ఈ వ్యవ‌హార‌మంతా పూర్తయ్యేస‌రికి కనీసం ఆరు నెలల స‌మ‌యం ప‌ట్టే అవకాశం ఉంది. దీంతో గ్రామాల్లో స‌ర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేకాధికారుల‌ను నియ‌మించేందుకు సర్కారు సిద్ధమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories