రాత్రి పబ్ కు వెళ్ళింది.. ఉదయం మరణించింది..!

రాత్రి పబ్ కు వెళ్ళింది.. ఉదయం మరణించింది..!
x
Highlights

రాత్రి సరదాగా సహాఉద్యోగులతో కలిసి పబ్ కు వెళ్ళింది. భర్త వేధింపులు , ఆర్ధిక ఇబ్బందులతో కలత చెంది ఆత్మహత్య చేసుకుందో మహిళ. ఈ ఘటన హైదరాబాద్ నగరం...

రాత్రి సరదాగా సహాఉద్యోగులతో కలిసి పబ్ కు వెళ్ళింది. భర్త వేధింపులు , ఆర్ధిక ఇబ్బందులతో కలత చెంది ఆత్మహత్య చేసుకుందో మహిళ. ఈ ఘటన హైదరాబాద్ నగరం చందానగర్ లో జరిగింది. వనస్థలిపురానికి చెందిన చిన్నలక్ష్మి, వీరభద్రం దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వారిలో చిన్నకుమార్తె రేఖ(30) లంగర్ హౌస్ కు చెందిన ఉజ్వల్‌ ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి , అమ్మాయి సంతానం. రేఖ , ఉజ్వల్ లు ఇద్దరు హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసేవారు నెలకు 50000 పైగానే జీతం. ఈ క్రమంలో ఇద్దరు ఇంటికి కావలసిన విలువైన వస్తువులు వాయిదా రూపంలో కొన్నారు.దాంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు భర్త ఉజ్వల్ ఆమెను అనుమానించేవాడు. వేసవి సెలవులు కావడంతో వారి పిల్లలు అమ్మమ్మ తాతయ్యల వద్దకు వెళ్లారు. ఆదివారం కంపెనీ ఇచ్చిన పార్టీకి హాజరుకావల్సిందింగా పిలుపు వచ్చింది.దీంతో రేఖను రాత్రి 10 గంటల సమయంలో పబ్ వద్ద దిగబెట్టాడు ఉజ్వల్. అర్ధరాత్రి మళ్ళీ వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. అయితే పని నిమిత్తం రోజు ఇంటికి లేట్ గా వస్తున్న రేఖపై కోప్పడ్డాడు ఉజ్వల్.. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. రాత్రి ఇద్దరు వేరు వేరు గదుల్లోకి వెళ్లి నిద్రించారు తెల్లారేసరికి రేఖ ఫ్యాన్ కు వేలాడటం చూసి షాక్ అయ్యాడు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించాలనుకున్నాడు కానీ రేఖ అప్పటికే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు రేఖ సోదరి రజినీ మాత్రం తన చెల్లి మృతికి ఉజ్వల్ ప్రవర్తనే కారణమంటున్నారు. నిత్యం ఆమెను వేధింపులకు గురిచేసేవాడని ఎవరితో ఫోన్ మాట్లాడిన అనుమానించేవాడని ఆరోపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories