జోన్‌ కోసం పోరు...రాజకీయ కారణాలతోనే రైల్వే జోన్‌కు కేంద్రం అడ్డుకట్ట

జోన్‌ కోసం పోరు...రాజకీయ కారణాలతోనే రైల్వే జోన్‌కు కేంద్రం అడ్డుకట్ట
x
Highlights

రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడంలేదంటూ టీడీపీ ఆరోపించింది. వైజాగ్ రైల్వే జోన్ ఇంకా పరిశీలిస్తున్నామనే కేంద్ర మంత్రి మాటలు...

రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడంలేదంటూ టీడీపీ ఆరోపించింది. వైజాగ్ రైల్వే జోన్ ఇంకా పరిశీలిస్తున్నామనే కేంద్ర మంత్రి మాటలు హస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించింది. విభజన చట్టం హామీల్లో ఒకటైన రైల్వేజోన్ కోసం టీడీపీ ఎంపీలు విశాఖపట్నంలో ఒక రోజు దీక్ష చేశారు. వెంటనే కేంద్రం దిగివచ్చి రైల్వే జోన్ పై ప్రకటన చేయకపోతే రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామని టీడీపీ ఎంపీలు హెచ్చరించారు. విభజన చట్టం హామీల్లో ఒకటైన రైల్వేజోన్ కోసం టీడీపీ ఎంపీలు విశాఖపట్నంలో ఒక రోజు దీక్ష చేశారు. ఈ దీక్షలో ఎంపీలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

ఏపీకి న్యాయం చేయాలన్న ఆలోచన కేంద్రానికి లేనట్లు కనిపిస్తుందని ఎంపీ మురళీ మెహన్ ఆరోపించారు. రైల్వే జోన్ విషయం ఇంకా పరిశీలిస్తున్నామనే కేంద్ర మంత్రి ప్రకటనలు హస్యాస్పదమన్నారు. వెంటనే రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేయకపోతే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామని హెచ్చరించారు. విభజన హామీల అమలుకు బీజేపీ నాయకులు హామీ ఇచ్చి మోసం చేస్తున్నారని మరో టీడీపీ ఎంపీ కె. రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. టీడీపీ ఏం చేసినా రాజకీయం ఉంటుందనే బీజేపీ నాయకులు రైల్వే జోన్ విషయంలో ఏ రాజకీయం ఉందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్రం వివక్షతతోనే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మోడీని సమర్థంగా ఎదుర్కోగల నాయకుడు దేశంలో చంద్రబాబు ఒక్కరేనని చెప్పారు. విభజన హామీల అమలుకోసం టీడీపీ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీల దీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. హోదాకు బదులుగా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్న ఏపీ ప్రభుత్వం బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న నిధుల్లో సీఎం చంద్రబాబు స్కాములకు తెరలేపారని ఆరోపించారు. గత నాలుగేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై సీఎం చంద్రబాబుకు లెక్క చెప్పే దమ్ముందా అంటూ ప్రశ్నించిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ దీక్షలతో ఒరిగేదేమిలేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories