పవన్‌కు కౌంటరిచ్చిన టీడీపీ యువ ఎంపీ
Highlights
విశాఖపట్టణంలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయా పార్టీలు, వారసత్వ రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర...
admin12 Dec 2017 5:38 AM GMT
విశాఖపట్టణంలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయా పార్టీలు, వారసత్వ రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘాటుగా స్పందించారు."నేను వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చినా మాకంటూ ఓ గుర్తింపు ఉంది" అని కౌంటరిచ్చారు. రాజకీయనాయకుల వారసులమైనంత మాత్రాన సత్తాలేదనడం సరికాదన్నారు. ఓ అవకాశం వస్తేనే కదా మేమేంటో నిరూపించుకోగలమన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకే వదిలేస్తున్నామని ఎంపీ చెప్పుకొచ్చారు.
మంత్రి నారా లోకేష్‌పై పవన్ ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐటీ, పంచాయతీరాజ్ శాఖ పరంగా లోకేష్ రాష్ట్రంలో ఎంతో డెవలప్ చేశారని ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Next Story