జగన్... దమ్ముంటే ఈరోజే చేయించు

జగన్... దమ్ముంటే ఈరోజే చేయించు
x
Highlights

ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ వ్యాఖ్యలపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో...

ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ వ్యాఖ్యలపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌కు దమ్ముంటే ఇవాళే ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు. ఏప్రిల్‌లో రాజీనామాలు చేస్తే ఆ తర్వాత ఉప ఎన్నికలు రావనే అలా చేస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఏడాది క్రితం కూడా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామన్నారని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారని... థర్డ్ ఫ్రంట్ లో ఆయన కీలకంగా ఉన్నారని, ప్రధానమంత్రులను తయారు చేశారని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. మళ్లీ అలాంటివి జరగవచ్చనే భయం బీజేపీకి ఉండవచ్చని అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయి కంటే ఉన్నత స్థాయికి చంద్రబాబు వెళ్లాలని సాక్షాత్తు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలాంటి వ్యక్తే కోరుతున్నారని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని జాతీయ పార్టీల మద్దతును తాము కోరామని అన్నారు. ప్యాకేజీ పేరుతో ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందన్న నమ్మకం తనకు లేదని జేసీ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories